ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓ కర్రకు దుప్పటిని కట్టి.. అనారోగ్యంతో ఉన్న 75 ఏళ్ల తల్లిని అందులో పడుకోబెట్టి.. 5 కిలోమీటర్ల దూరం మోసుకెళ్లి..!

ABN, First Publish Date - 2022-07-01T02:35:46+05:30

వర్షాకాలం వచ్చిందంటే లోతట్టు ప్రాంతాల వారికి ఎలాంటి సమస్యలు ఎదురవుతుంటాయో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక రోడ్డు సౌకర్యం లేని కొండ ప్రాంతాల్లో నివాసం ఉండే వారి పరిస్థితి నరకప్రాయంగా ఉంటుంది. అనారోగ్యం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వర్షాకాలం వచ్చిందంటే లోతట్టు ప్రాంతాల వారికి ఎలాంటి సమస్యలు ఎదురవుతుంటాయో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక రోడ్డు సౌకర్యం లేని కొండ ప్రాంతాల్లో నివాసం ఉండే వారి పరిస్థితి నరకప్రాయంగా ఉంటుంది. అనారోగ్యం సంభవించినప్పుడు.. ఇక వారి అవస్థలు వర్ణణాతీతంగా ఉంటాయి. అహ్మదాబాద్‌లోని ఓ గిరిజన గ్రామం.. ఇందుకు నిదర్శనంగా మారింది. 75ఏళ్ల తల్లికి అనారోగ్యంగా ఉండడంతో ఆస్పత్రికి తీసుకెళ్లాలని భావించారు. అయితే గ్రామానికి వాహనాలు రాలేని పరిస్థితి. దీంతో దుపట్లో తల్లిని పడుకోబెట్టి.. ఓ కర్ర సాయంతో అంతా మోసుకెళ్లారు. దీనిపై నెటిజన్లు అయ్యో! పాపం.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.


గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లోని గరుడేశ్వర్ తాలాకా పరిధి జర్వానీ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ గ్రామంలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా గ్రామం నుంచి పట్టణానికి రోడ్డు సౌకర్యం లేకపోవడం.. పెద్ద సమస్యగా మారింది. వర్షాకాలంలో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ప్రధాన రహదారిని చేరుకోవాలంటే సుమారు 4నుంచి 5కిలోమీటర్లు నడవాల్సి వస్తోంది. ఇటీవల గ్రామానికి చెందిన  75 ఏళ్ల వృద్ధురాలు అనారోగ్యానికి గురైంది.

చనిపోయిన తండ్రి పాత దుస్తులను.. మధుర జ్ఞాపకంగా మార్చిన కూతురు.. ప్రశంసల వర్షం కురిపిస్తున్న నెటిజన్లు..


చికిత్స నిమిత్తం ఆమెను ఆస్పత్రికి తరలించాలంటే వాహనాలు వెళ్లలేని పరిస్థితి. దీంతో వృద్ధురాలి కుమారుడు ధీరజ్ వాసవా, మరో వ్యక్తి కలిసి.. వృద్ధురాలిని దుప్పట్లో పడుకోబెట్టి, కర్ర సాయంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై బీజేపీ నర్మదా అధ్యక్షుడు ఘనశ్యామ్ పటేల్ మాట్లాడుతూ.. ఘటన జరిగిన చుట్టు పక్కల ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. జర్వానీ గ్రామంలో సమస్యలు తన దృష్టికి వచ్చాయని.. త్వరలో పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.

భర్త చనిపోయిన నెల తర్వాత.. ఓ భార్య షాకింగ్ నిర్ణయం.. నా కూతుర్ని నువ్వే చూసుకో అంటూ లేఖలో తల్లికి రాసి మరీ..

Updated Date - 2022-07-01T02:35:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising