ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

75 years in 2 minutes : గూగుల్ ఇండియా రూపొందించిన వీడియో ఇదీ.. 2 నిమిషాల్లో 75 ఏళ్ల స్వతంత్ర భారతం..

ABN, First Publish Date - 2022-08-10T22:44:13+05:30

స్వాతంత్ర్యం సిద్ధించిన రోజు ఆగస్టు 15, 1947 అపురూప క్షణాల్లో ఆనందంతో ఉప్పొంగిన కోట్లాది భారతీయ హృదయాల నుంచి 1983 క్రికెట్ వరల్డ్ కప్ విజయం వరకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : స్వాతంత్ర్యం సిద్ధించిన రోజు ఆగస్టు 15, 1947 అపురూప క్షణాల్లో ఆనందంతో ఉప్పొంగిన కోట్లాది భారతీయ హృదయాల నుంచి 1983 క్రికెట్ వరల్డ్ కప్ విజయం వరకు... 75 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో భారత్ ముద్దాడిన ఘనతలు ఎన్నో ఎన్నెన్నో. ఈ మైలురాళ్లన్నింటినీ 2 నిమిషాల్లో చూపిస్తూ ‘గూగుల్ ఇండియా’ ఒక అందమైన వీడియోని రూపొందించింది. ‘ఇండియాకి  ఉడాన్’ పేరిట (IndiaKiUdaan) యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోకి విశేష స్పందన లభిస్తోంది. స్వాతంత్ర్యోద్యమ ముగింపు ఘట్టం, స్వతంత్ర భారత్‌లో తొలి ఎన్నికల ఘట్టం, రాజ్యాంగం రూపకల్పన, మొదటి పంచవర్ష ప్రణాళిక, ఇండియాలో తొలి కంప్యూటర్ వినియోగం, హరిత విప్లవం, శ్వేతవిప్లవం, తొలి అంతరిక్ష ప్రయోగం, భారతీయ వ్యక్తికి తొలి ఆస్కార్, 1983 క్రికెట్ వరల్డ్ కప్ విజయం, 1991 - ఆర్థిక సంస్కరణలు, సినిమారంగం, పోలియో నిర్మూలన, విద్యాహక్కు చట్టం, యూపీఐ చెల్లింపుల వరకు కీలక ఘట్టాలను ఈ వీడియో గూగుల్ ఇండియా స్పృశించింది. ఆ క్షణాలను మీరూ ఒకసారి గుర్తుచేసుకోండి..



Updated Date - 2022-08-10T22:44:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising