ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral News: ఛీ.. ఛీ.. బాత్‌రూమ్‌కు వెళ్లొచ్చుగా.. విమానంలో ఈ 72ఏళ్ల వృద్ధుడు ఏం చేశాడంటే..

ABN, First Publish Date - 2022-11-05T10:22:33+05:30

అతడి వయసు 72ఏళ్లు. నలుగురికీ మంచి, చెడులు చెప్పే వయసులో.. అందరూ అసహ్యించుకునే పని చేశాడు. తోటి ప్రయాణికులు ఇబ్బంది పడతారు అనే ఆలోచన కూడా లేకుండా విమానంలో రచ్చ రచ్చ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: అతడి వయసు 72ఏళ్లు. నలుగురికీ మంచి, చెడులు చెప్పే వయసులో.. అందరూ అసహ్యించుకునే పని చేశాడు. తోటి ప్రయాణికులు ఇబ్బంది పడతారు అనే ఆలోచన కూడా లేకుండా విమానంలో రచ్చ రచ్చ చేశాడు. దీంతో ప్రస్తుతం అతడు చేసిన నిర్వాకం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో అతడు చేసిన పని గురించి తెలుసుకుని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఇంతకూ అతడు ఎవరు? విమానంలో ఏం చేశాడు? అనే పూర్తి వివరాల్లోకి వెళితే..

అతడి పేరు జేమ్స్ హ్యూస్(James Hughes). ఆస్ట్రేలియాకు చెందిన ఇతడి వయసు ప్రస్తుతం 72ఏళ్లు. కాలక్షేపం కోసం కొద్ది రోజుల క్రితం ఇండోనేషియా వెళ్లాడు. అక్కడ ప్రముఖ పర్యాటక ప్రాంతం అయిన బాలీలో ఎంజాయ్ చేశాడు. అనంతరం తాజాగా తిరుగుపయనం అయ్యాడు. బాలీ-బ్రిస్బేన్ ఫ్లైట్ ఎక్కేశాడు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ ఆ తర్వాతే ఇతడు దారుణమైన పని చేశాడు. మూత్ర విసర్జన కోసం బాత్‌రూమ్‌కు వెళ్లకుండా.. తోటి ప్రయాణికులు ఇబ్బంది పడతారనే ఆలోచన కూడా లేకుండా.. విమానం సీటులోనే కూర్చుని.. మూత్ర విసర్జన చేశాడు.

విషయం.. విమాన సిబ్బందికి తెలియడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే విమానం ఆస్ట్రేలియాలో ల్యాండ్ అవగానే.. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా.. విమానం ఎక్కిన తర్వాత జేమ్స్ భారీ మొత్తంలో ఆల్కహాల్‌ను సేవించాడని.. ఆ మద్యం మత్తులో సీటులో కూర్చొనే మూత్ర విసర్జన చేశాడని తోటి ప్రయాణికులు చెబుతున్నారు.

Updated Date - 2022-11-05T10:47:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising