ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral News: 71ఏళ్ల వయసులో ఈ బామ్మ చేస్తున్న పని చూసి హాట్సాఫ్ చెబుతున్న నెటిజన్లు!

ABN, First Publish Date - 2022-09-29T16:54:43+05:30

ఆమె వయసు ప్రస్తుతం 71ఏళ్లు. సాధారణంగా ఈ ఏజ్‌లో ఎవరైనా ఇంటి పట్టున ఉండి, మనవడు లేదా మనవరాలితో ఆడుకుంటూ కాలక్షేపం చేస్తారు. కానీ ఆ మహిళ మాత్రం అలా చేయడం లేదు. వృద్ధాప్యంలోనూ డ్రైవింగ్ స్కూల్‌ను నడిపిస్తూ అందరినీ ఆ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఆమె వయసు ప్రస్తుతం 71ఏళ్లు. సాధారణంగా ఈ ఏజ్‌లో ఎవరైనా ఇంటి పట్టున ఉండి, మనవడు లేదా మనవరాలితో ఆడుకుంటూ కాలక్షేపం చేస్తారు. కానీ ఆ మహిళ మాత్రం అలా చేయడం లేదు. వృద్ధాప్యంలోనూ డ్రైవింగ్ స్కూల్‌ను నడిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. విద్యార్థులకు డ్రైవింగ్‌లో మెలకువలు నేర్పుతూ ఔరా అనిపిస్తోంది. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఆమె వద్ద ప్రస్తుతం డిఫరెంట్ కేటగిరీలకు చెందిన 11 డ్రైవింగ్ లైసెన్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమెకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


కేరళ(Kerala)లోని తొప్పుంపూడి ప్రాంతానికి చెందిన ఆ బామ్మ పేరు జే. రాధామణి అమ్మ(J Radhamani Amma). స్థానికులు ఈమెను మణియమ్మ అని పిలుస్తుంటారు. రాధామణికి 20ఏళ్ల వయసులోనే ఓ వ్యక్తితో వివాహం జరిగింది. వివాహానంతరం రాధామణి భర్త 1970లో ఏ-జెడ్ పేరుతో ఓ డ్రైవింగ్ స్కూల్‌(Driving School)ను ప్రారంభించాడు. అనంతరం  రాధామణికి దగ్గరుండి మరీ బస్సు, ట్రక్కు డ్రైవింగ్ నేర్పించాడు. అలా భర్త తర్ఫీదులో డ్రైవింగ్ నేర్చుకున్న ఈమె.. 30ఏళ్ల వయసులో 1988లో మొదటిసారిగా డ్రైవింగ్ లైసెన్స్‌ను పొందింది. ఈ క్రమంలోనే 2004లో ఓ రోడ్డు ప్రమాదంలో భర్తను కోల్పోయిన రాధామణి.. అతడు స్థాపించిన డ్రైవింగ్ స్కూల్‌ను పిల్లల సహాయంతో నడిపిస్తోంది. జేసీబీ, ఆటోరిక్షా, క్రేన్, ఫోర్క్‌లిఫ్ట్ వంటి వాహనాలను కూడా నడపటం నేర్చుకున్న ఆమె.. 11 కేటగిరీల్లో డ్రైవింగ్ లైసెన్స్‌(Driving Licences)ను పొందింది. డ్రైవింగ్ స్కూల్‌కు వచ్చిన విద్యార్థులకు మెలకువలు చెబుతోంది.


70ఏళ్ల విద్యార్థిని..

ఏడు పదుల వయసులో రాధామణి అమ్మ.. విద్యార్థినిగా మారారు. స్థానికంగా ఉన్న మెకానికల్ ఇంజినీరింగ్ కాలేజీలో డిప్లామా చేస్తోంది. కాగా.. ప్రస్తుతం ఈమెకు సంబంధించిన ఫొటోలు, వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో స్పందిస్తున్న నెటిజన్లు.. ఆమె పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎంతో మంది యువతకు ఆమె ఆదర్శం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 


Updated Date - 2022-09-29T16:54:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising