ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశంలోని 70 శాతం మంది శ్రీమంతులు తమ పిల్లలను చదువుల కోసం ఎక్కడకు పంపిస్తున్నారంటే..

ABN, First Publish Date - 2022-02-20T17:13:43+05:30

భారతదేశంలోని చాలా మంది కోటీశ్వరులు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారతదేశంలోని చాలా మంది కోటీశ్వరులు తమ పిల్లలను చదువుల కోసం విదేశాలకు పంపిస్తున్నారు. అయితే ఇలా వెళుతున్నవారు ఏ విద్యపై మక్కువ చూపుతున్నారు? వారికి ఇష్టమైన దేశాలేమిటనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. హురున్ ఇండియా వెల్త్ రిపోర్ట్- 2021లోని వివరాల ప్రకారం.. దేశంలోని 70 శాతం మంది కోటీశ్వరులు తమ పిల్లలను విదేశాలకు పంపించి చదివించాలనుకుంటున్నారు. 29 శాతం మంది కోటీశ్వరులు తమ పిల్లలను విదేశాల్లో చదివించేందుకు అమెరికాను ఎంచుకున్నారు. 


19 శాతం మంది కోటీశ్వరులు తమ పిల్లలను UKకి, 12 శాతం మంది న్యూజిలాండ్‌కు చదువుల కోసం తమ పిల్లలను పంపిస్తున్నారు. ఈ జాబితాలో జర్మనీ నాలుగో స్థానంలో ఉంది. 11 శాతం మంది కోటీశ్వరులు తమ పిల్లలను చదువుల కోసం జర్మనీకి పంపిస్తున్నారు. ఇదిలావుంటే విదేశీ విద్యార్థులు ఉన్నత చదువుల కోసం భారత్‌కు వస్తున్నారు. 2019-20 అకడమిక్ సెషన్‌కు 49,348 మంది విదేశీ విద్యార్థులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం, 2019లో 164 దేశాల నుండి విద్యార్థులు భారతదేశంలో చదువుకోవడానికి తమ పేర్లను నమోదు చేసుకున్నారు. 2020లో ఈ సంఖ్య 168కి చేరుకుంది. విదేశాల నుంచి భారత్‌కు వస్తున్న విద్యార్థుల్లో ఎక్కువ మంది బీటెక్‌లో ప్రవేశం పొందుతున్నారు. 9,503 మంది విద్యార్థులు బీటెక్‌లో చేరగా, బీఎస్సీలో 3964, బీబీఏలో 3290, బీఈలో 2596 మంది విదేశీ విద్యార్థులు చేరారు. ఇందులో 2451 మంది విదేశీ విద్యార్థులు BPharmలో, 2295 మంది BAలో, 1820 మంది BCA కోర్సులో చేరారు. ప్రస్తుత ఆన్‌లైన్ విద్యా ధోరణి కారణంగా పలు విదేశీ విశ్వవిద్యాలయాలలో చేరే భారతీయ విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా స్వల్పకాలిక కోర్సులు చేయాలనుకునే భారతీయ విద్యార్థులు ఈ దిశగా మొగ్గు చూపుతున్నారు. 


Updated Date - 2022-02-20T17:13:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising