ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంట్లోకి దూరిన పిల్ల ఎలుగుబంటి.. తలుపులేసి కుటుంబ సభ్యులు పరార్.. లోపల ఆ ఎలుగుబంటి ఏం చేసిందంటే..

ABN, First Publish Date - 2022-01-07T18:22:54+05:30

సమీప అడవి నుంచి వచ్చిన ఎలుగుబంటి పిల్ల ఓ ఇంట్లో హల్‌చల్ చేసింది.. ఒక్కసారిగా ఇంట్లో ఎలుగుబంటిని చూసిన వారు షాకయ్యారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సమీప అడవి నుంచి వచ్చిన ఎలుగుబంటి పిల్ల ఓ ఇంట్లో హల్‌చల్ చేసింది.. ఒక్కసారిగా ఇంట్లో ఎలుగుబంటిని చూసిన వారు షాకయ్యారు.. వెంటనే తేరుకుని అది ఉన్న గది తలుపులు వేసేశారు.. ఆ గది లోపల పిల్ల ఎలుగుబంటి తన విన్యాసాలు ప్రదర్శించింది.. మంచం మీదకు ఎక్కి ఆడుకుంది.. బయటకు వెళ్లేందుకు మార్గం కోసం చూసింది.. చివరకు అటవీ అధికారులు దానిని పట్టుకుని తీసుకెళ్లిపోయారు. 


రాజస్థాన్‌లోని కోటాకు సమీపంలో ఉన్న శుంభుపుర గ్రామానికి సమీప అడవి నుంచి గురువారం ఓ ఎలుగుబంటి పిల్ల వచ్చింది. నేరుగా రామ్‌స్వరూప్ గుజ్జార్ అనే వ్యక్తి బెడ్రూమ్‌లోకి వెళ్లిపోయింది. దీంతో షాకైన రామ్‌స్వరూప్ వెంటనే ఆ బెడ్రూమ్ తలుపులు వేసేశాడు. దీంతో లోపలే చిక్కుకుపోయిన ఎలుగుబంటి పిల్ల మంచం పై నుంచి కిందకు దూకుతూ ఆడుకుంది. అనంతరం బయటకు వెళ్లేందుకు మార్గం గురించి అన్వేషించింది. ఈ లోపు అటవీ అధికారులకు సమాచారం అందడంతో వారు అక్కడకు వెళ్లారు. 


ఎలుగుబంటికి మత్తు మందు ఇచ్చి దానిని స్ప‌ృహ తప్పేలా చేశారు. అనంతరం దానిని బయటకు తీసుకెళ్లారు. ఆ ఎలుగుబంటి కాలికి, చేతికి దెబ్బలు తగలడంతో దానికి చికిత్స అందిస్తున్నారు. అది కోలుకున్న తర్వాత అడవిలో వదిలేస్తామని చెప్పారు. 

Updated Date - 2022-01-07T18:22:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising