ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Shocking Report: Social Media ఏం చెబితే మనోళ్లకు అదే వేదమట!

ABN, First Publish Date - 2022-07-01T16:49:48+05:30

ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్.. ఈ రెండూ ప్రస్తుతం దాదాపు అందరి వద్దా ఉన్నాయి. దీంతో సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో చక్కర్లు కొడున్న సమాచారం నిజమా? అబద్ధమా? అని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్.. ఈ రెండూ ప్రస్తుతం దాదాపు అందరి వద్దా ఉన్నాయి. దీంతో సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం నిజమా? అబద్ధమా? అని నిర్ధారించుకోకుండానే అదే వాస్తవమని నమ్ముతున్నారు. ముఖ్యంగా భారతీయులు సామాజిక మాధ్యమాల్లో వచ్చే సమాచారన్నే ఎక్కువగా విశ్వసిస్తున్నారు. ఈ విషయాన్ని ‘ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్’ తాజాగా వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. ఏదైనా సమాచారం తప్పా..ఒప్పా అని తెలుసుకోవాల్సి వస్తే.. భారతీయులు సోషల్ మీడియానే ఆశ్రయిస్తున్నారట. సుమారు 54శాతం మంది భారతీయులు ఇన్‌స్టాగ్రామం, ట్విట్టర్, ఫేస్‌బుక్ తదితర మాధ్యామాలను ఆశ్రయిస్తున్నారని నివేదిక పేర్కొంది. 


అయితే  బ్రిటన్‌లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందని తెలింది. యూకేలో కేవలం 16శాతం మంది జనాభా మాత్రమే.. సోషల్ మీడియాను ఉపయోగిస్తారని వెల్లడైంది. భారత్‌తో పోల్చితే మెక్సికో.. సౌతాఫ్రికాలో కూడా సోషల్ మీడియా ద్వారా వచ్చే సమాచారాన్ని విశ్వసించే వారి సంఖ్య తక్కువగనే ఉంది. ఈ దేశాల్లో 43శాతం మంది మాత్రమే సామాజిక మాద్యమాలపై ఆధారపడతారనే విషయం వెలుగులోకి వచ్చింది. నిజానిజాలు తెలుసుకోవడానికి ప్రపంచ వ్యాప్తంగా పది మందిలో కేవలం నలుగురు మాత్రమే సరైన సమాచారం కోసం సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నారని పేర్కొంది. 



భారతదేశ ప్రజలు ముఖ్యంగా వాట్సప్ ద్వారా వచ్చిన సమాచారం కరెక్టే అని నమ్ముతున్నారట. దాదాపు 48శాతం మంది వాట్సప్ కన్వర్జేషన్‌లను విశ్వస్తుండగా.. సుమారు 40 మంది ప్రజలు వికీపీడియాను పాపులర్ సోర్సుగా నమ్ముతున్నారని తేలింది.  25 నుంచి 44ఏళ్ల వయసు గల వారిలో 44శాతం మంది సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లవైపు మొగ్గు చూపుతున్నారని.. అదే 55ఏళ్లు పైబడిన వారిలో కేవలం 12శాతం మంది మాత్రమే వాటిపై ఆసక్తి చూపిస్తున్నారని అధ్యయనం తెలిపింది. మిగతా దేశాలతో పోలిస్తే, సామాజిక మాధ్యమాల్లో తాము చదివిన, పంచుకున్న సమాచారం నిజమేనని 87% భారతీయులు నమ్మారని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ తన నివేదికలో వెల్లడించింది. 


Updated Date - 2022-07-01T16:49:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising