ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముసలోడే కానీ మహానుభావుడు.. కొడుకు మాజీ లవర్‌తో ప్రేమాయణం.. చివరకు..

ABN, First Publish Date - 2022-07-01T21:45:15+05:30

ప్రేమ ఎప్పుడు, ఎలా, ఎవరి మీద పుడుతుందో చెప్పలేం.. ప్రేమకు కుల, మత భేదాలు, వయసు తారతమ్యాలు ఉండవు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రేమ ఎప్పుడు, ఎలా, ఎవరి మీద పుడుతుందో చెప్పలేం.. ప్రేమకు కుల, మత భేదాలు, వయసు తారతమ్యాలు ఉండవు. ఓ యువతి తన కంటే వయసులో 24 ఏళ్లు పెద్ద వాడైన వ్యక్తితో ప్రేమలో పడి చివరకు పెళ్లి కూడా చేసుకుంది. ఇంతకీ విశేషమేమిటంటే.. ఆ వ్యక్తి ఆమె మాజీ బాయ్‌ఫ్రెండ్ తండ్రి. బాయ్‌ఫ్రెండ్‌కు బ్రేకప్ చేసిన ఆ యువతి అతని తండ్రితో ప్రేమలో పడింది. Americaలోని ఒహియోలో ఈ  వింత సంఘటన జరిగింది. 


ఇది కూడా చదవండి..

డైమండ్ రింగ్‌తో ప్రపోజ్ చేసి ప్రేయసికి షాకిద్దామనుకున్నాడు.. చివరకు జరిగిందేమిటంటే..


ఒహియోకు చెందిన సిడ్నీ డీన్ అనే 27 ఏళ్ల యువతి, పాల్ అనే 51 ఏళ్ల వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ ఒహియోలో ఒకే ప్రాంతంలో నివసించేవారు. సిడ్నీకి 11 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆమె పాల్ కొడుకుతో స్నేహం చేసేది. అతడి కోసం రోజూ పాల్ ఇంటికి వెళ్లేది. పాల్ కొడుకుతో కొన్ని రోజులు డేటింగ్ చేసింది. ఆ క్రమంలో పాల్‌కు కూడా ఆమె దగ్గరైంది. ఇద్దరూ ఛాటింగ్ చేసుకునేవారు. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమలో పడ్డారు. దాంతో పాల్ కొడుక్కి ఆమె బ్రేకప్ చెప్పేసింది. పాల్, సిడ్నీ చాలా కాలం డేటింగ్ చేశారు. 


ప్రస్తుతం పాల్ వయసు 51 ఏళ్లు కాగా, సిడ్నీ వయసు 27 ఏళ్లు. చాలా కాలంగా ప్రేమలో ఉన్న ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. 2016లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబాల వారు ఈ పెళ్లిని ఆమోదించలేదు. సిడ్నీ తల్లిదండ్రులు, పాల్ కొడుకు తీవ్రంగా ఆక్షేపించారు. తర్వాత మెల్లిమెల్లిగా పరిస్థితిలో మార్పు వచ్చింది. ప్రస్తుతం పాల్ కొడుకు కూడా వీరితో కలిసే ఉంటున్నాడు. తాజాగా వీరి ప్రేమకథ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Updated Date - 2022-07-01T21:45:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising