ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

BEWARE: స్విమ్మింగ్ పూల్, నదుల్లో స్నానం చేసొచ్చాక.. ఈ లక్షణాలు కనిపిస్తే లైఫ్ రిస్క్‌లో ఉన్నట్టే..

ABN, First Publish Date - 2022-08-06T22:00:58+05:30

స్విమ్మింగ్ చేయడం వల్ల శరీరం ఫిట్‌గా ఉంటుంది. అందుకే చాలా మంది నగర వాసులు స్విమ్మింగ్ పూల్స్‌కు వెళ్లి ఈత కొడుతూ ఉంటారు. అదే గ్రామాల్లో నివసిస్తున్న వారైతే.. దగ్గర్లో ఉన్న బావి లేద నదికి వెళ్తారు. స్విమ్మింగ్ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: స్విమ్మింగ్ చేయడం వల్ల శరీరం ఫిట్‌గా ఉంటుంది. అందుకే చాలా మంది నగర వాసులు స్విమ్మింగ్ పూల్స్‌(swimming pools)కు వెళ్లి ఈత కొడుతూ ఉంటారు. అదే గ్రామాల్లో నివసిస్తున్న వారైతే.. దగ్గర్లో ఉన్న బావి లేదా నదికి వెళ్తారు. స్విమ్మింగ్ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా.. నీటిలో ఉండే ఓ జీవి వల్ల లైఫ్ రిస్క్‌లో పడే ప్రమాదం ఉంది. తల నొప్పి, జ్వరం, మెడ పట్టేసినట్టవడం, బ్యాలెన్స్ కోల్పోవడం, మూర్చ రావడం, వికారంగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించడం బెటర్.. ఎందుకంటే..



నెగ్లేరియా ఫౌలెరి (Naegleria Fowleri).. ఇది ఒక అమీబ(Amoeba) పేరు. దీన్నే బ్రెయిన్ ఈటింగ్ అమీబా(Brain-eating Amoeba ) అని కూడా పిలుస్తుంటారు. ఇదే స్విమ్మింగ్ పూల్, సరస్సులు, నదుల్లో ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. ముక్కు ద్వారా మనిషి శరీరంలోకి ప్రవేశిస్తుంది. అలా మనిషి శరీరంలో ఎంటరైన ఐదురోజుల్లోనే మెదడును ఇన్‌ఫెక్ట్ చేసి.. ప్రాణాలు తీస్తుంది. తాజాగా ఇజ్రాయెల్‌కు చెందిన 36ఏళ్ల వ్యక్తి దీని బారినపడి ప్రాణాలు వదిలాడు. నెగ్లేరియా ఫౌలెరి వల్ల ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ (PAM) అనే అరుదైన ఇన్ఫెక్షన్‌కు గురై అతడు ప్రాణాలు వదిలినట్టు వైద్యుల పరిశీలినలో తేలింది. కాగా.. యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (US CDC) ప్రకారం.. 1962-2019 మధ్య 148 కేసులు  అమెరికాలో నమోదయ్యాయి. గత 10ఏళ్లలో 34 మంది దాని బారిన పడగా.. కేవలం ముగ్గురు మాత్రమే అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు. PAM ఇన్‌ఫెక్షన్ బారిన పడిన వారికి వైద్యం అందించడానికి నిర్దిష్టమైన చికిత్సా విధానం లేదని వైద్యులు చెబుతున్నారు. 


Updated Date - 2022-08-06T22:00:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising