ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కూతురు నిద్రలోనే చనిపోయిందనుకున్న తల్లిదండ్రులు.. అంత్యక్రియల సమయంలో ఆ బాలిక జననాంగాలపై రక్తం కనబడడంతో..

ABN, First Publish Date - 2022-04-06T20:23:28+05:30

ఏడేళ్ల ఆ బాలిక తన బంధువుల ఇంటికి వెళ్లింది.. రాత్రి అక్కడ నిద్రపోయింది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏడేళ్ల ఆ బాలిక తన బంధువుల ఇంటికి వెళ్లింది.. రాత్రి అక్కడ నిద్రపోయింది.. తర్వాతి రోజు ఉదయం ఎంత లేపినా ఆ బాలిక లేవలేదు.. దీంతో అనారోగ్య కారణంతో ఆ బాలిక చనిపోయిందనుకుని కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు సిద్ధపడ్డారు.. అంత్యక్రియల సమయంలో ఆ బాలిక జననాంగంపై రక్తం ఉండడాన్ని తల్లి గమనించింది.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. కేసును విచారించిన కోర్టు అతడికి జీవిత ఖైదు విధించింది.


రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఏడేళ్ల బాలిక 2020లో తన తల్లిదండ్రులతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లింది. ఆ బాలికను బంధువుల ఇంట్లో పడుక్కోబెట్టి తల్లిదండ్రులు బయటకు వెళ్లారు. ఆ సమయంలో బంధువు అయిన 35 ఏళ్ల వ్యక్తి ఆ బాలికను చూశాడు. నిద్రపోతున్న ఆ బాలికను ఇంటికి దగ్గర్లోనే వేరే ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆ బాలిక జననాంగం నుంచి రక్తం రావడాన్ని చూసి భయపడి, విషయం ఎవరికైనా చెప్పేస్తుందేమోనని ఆ బాలిక గొంత నులిమి చంపేశాడు. అనంతరం ఇంటికి తీసుకెళ్లి మంచం మీద పడేశాడు. 


తర్వాతి రోజు ఉదయం తల్లిదండ్రులు ఎంత లేపినా ఆ బాలిక లేవలేదు. దీంతో ఆ బాలిక అనారోగ్యం కారణంగా చనిపోయి ఉంటుందని తల్లిదండ్రులు భావించారు. గ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. అయితే అంత్యక్రియల కార్యక్రమంలో స్నానం చేయించే సమయంలో ఆ బాలిక జననాంగంపై రక్తం తల్లి కంటబడింది. దీంతో వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు పంపించారు. 


ఆ బాలికను ఎవరో అత్యాచారం చేసి గొంతు నులిమి చంపేశారని పోస్ట్‌మార్టమ్‌లో తేలింది. దీంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. బాలిక బంధువులను విచారించి 35 ఏళ్ల నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడు పోలీసుల ఎదుట నేరాన్ని అంగీకరించాడు. ఈ కేసును రెండేళ్ల పాటు విచారించిన కోర్టు నిందితుడికి జీవిత ఖైదు శిక్షగా విధించింది. 

Updated Date - 2022-04-06T20:23:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising