ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

28 ఏళ్ల యువతి.. ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం.. చివరికి ఆమె చేసిన పని ఇదీ..

ABN, First Publish Date - 2022-01-14T01:51:20+05:30

ఆ యువతి వయసు 28 ఏళ్లు. ఉన్నత చదువులు చదివుకుంది. ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంది. ఎప్పుడూ చదువులో ముందుండే యువతి ఆ నమ్మకంతోనే ఎంతో కష్ట

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఆ యువతి వయసు 28 ఏళ్లు. ఉన్నత చదువులు చదివుకుంది. ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంది. ఎప్పుడూ చదువులో ముందుండే యువతి ఆ నమ్మకంతోనే ఎంతో కష్టపడి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది. ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకుంది. కానీ సడన్‌గా ఓ రోజు ఆమె అనూహ్య నిర్ణయం తీసుకుంది. అదేంటో తెలిస్తే షాకవుతారు. పూర్తి వివరాల్లోకెళ్తే..


ఛత్తీస్‌గఢ్‌లోని కార్బా ప్రాంతానికి చెందిన భగత్‌రామ్‌కు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. భగత్‌రామ్ దంపతులకు 28 ఏళ్ల కూతురు రాంకుమారి ఉంది. ఎంఏ వరకు చదువుకున్న ఆమె పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనే పట్టుదలతో పగలు రాత్రి    కష్టపడి చదివింది. అన్ని పోటీ పరీక్షలకు హాజరయ్యేది. అలా ఐదు సంవత్సరాలుగా ఆమె కష్టపడి చదివి పరీక్షలు రాసినా ఫలితం లేకపోయింది. ఏ ప్రభుత్వ ఉద్యోగం ఆమెకు దక్కలేదు. దీంతో రాంకుమారి తీవ్ర మనస్తాపానికి లోనైంది. ఇక తనకు ఉద్యోగం రాదనే బాధతో అనూహ్య నిర్ణయం తీసుకుంది. బుధవారం రాత్రి కుటుంబసభ్యులందరితో కలిసి భోజనం చేసింది. ఆ తరువాత పడుకోవడానికి తన గదిలోకి వెళ్లింది. అయితే అందరూ నిద్రించిన తరువాత ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

 


ఉదయాన్నే నిద్ర లేచిన కుటుంబ సభ్యులు కిటికీలోంచి కనిపించిన దృశ్యం చూసి షాకయ్యారు. అనంతరం ఆమెను ఉరి కొయ్య నుంచి కిందకు దించారు. అప్పటికే మరణించినట్టు గుర్తించి బోరున విలపించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యువతి గది అంతా పరిశీలించారు. ఆత్మహత్యకు ముందు బాధితురాలు రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఆమె ‘‘అమ్మా.. నాన్నా.. నాకు ఇక ప్రభుత్వ ఉద్యోగం రాదు. అందుకే నేను చనిపోతున్నా. నన్ను క్షమించండి. ’’ అని రాసిపెట్టింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తరలించారు.




Updated Date - 2022-01-14T01:51:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising