ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral News: 28ఏళ్ల యువకుడికి ఇప్పటికే 24 పెళ్లిళ్లు.. వివాహం తర్వాత అతడు చేసే పని తెలిస్తే షాకవుతారు!

ABN, First Publish Date - 2022-10-04T02:26:45+05:30

అతడి వయసు 28ఏళ్లే. కానీ ఇప్పటి వరకు 24 మందిని వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం ఇతడికి సంబంధించిన వార్త స్థానికంగా చర్చనీయాంశం అయింది. ఈ నేపథ్యంలో ఇంతకూ అతడు ఎవరు? 24 పెళ్లిళ్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: అతడి వయసు 28ఏళ్లే. కానీ ఇప్పటి వరకు 24 మందిని వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం ఇతడికి సంబంధించిన వార్త స్థానికంగా చర్చనీయాంశం అయింది. ఈ నేపథ్యంలో ఇంతకూ అతడు ఎవరు? 24 పెళ్లిళ్లు ఎందుకు చేసుకున్నాడు? వివాహానంతరం అతడు ఏం చేస్తున్నాడు? అనే పూర్తి విషయాలు తెలియాలంటే.. పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే..


బెంగాల్‌కు చెందిన ఈ యువకుడి పేరు అసబుల్. ఐడెంటిటీని మార్చుకుంటూ ఇప్పటి వరకు ఇతడు 24 మంది యువతులను వివాహం చేసుకున్నాడు. ఇతడి చేతిలో మోసపోయిన ఓ యువతి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. అసబుల్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన అధికారులు.. అసబుల్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. 



అసబుల్.. తన ఐడెంటిటీని మార్చుకుంటూ ఇప్పటి వరకు 24 మంది యువతులను మోసం చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. తన గుర్తింపు దాచిపెట్టి.. యువతులతో పరిచయం ఏర్పరచుకోవడంతోపాటు.. వాళ్లను పెళ్లికి ఒప్పించినట్టు వెల్లడించారు. అనంతరం యువతుల తల్లిదండ్రులతో మాట్లాడి.. వివాహం చేసుకున్నట్టు చెప్పారు. పెళ్లి తర్వాత కొన్ని రోజులపాటు అత్తామామల ఇంటి వద్దనే ఉండి.. ఆ తర్వాత బంగారం, నగదుతో అక్కడి నుంచి పారిపోతున్నట్టు తెలిపారు. బెంగాల్‌తోపాటు బిహార్‌లో కూడా ఇతడు మోసాలకు పాల్పడినట్టు తమ విచారణలో వెల్లడైందన్నారు. ఓ బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని.. అసబుల్‌ను పట్టుకున్నట్టు చెప్పారు. కాగా.. ప్రస్తుతం ఇతడి వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశం అయింది. 


Updated Date - 2022-10-04T02:26:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising