ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: 1958 కాలం నాటి రిఫ్రిజిరేటరే సో బెటర్.. డౌటుంటే ఉంటే ఈ వీడియో చూసేయండి!

ABN, First Publish Date - 2022-07-24T20:00:20+05:30

Refrigerator(రిఫ్రిజిరేటర్).. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది పరోక్షంగానో లేదా ప్రత్యేక్షంగానూ దీని సేవలను వినియోగించుకుంటున్నారు. అయితే ఇపుడు ఈ రిఫ్రిజిరేటర్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: Refrigerator(రిఫ్రిజిరేటర్).. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది పరోక్షంగానో లేదా ప్రత్యేక్షంగానూ దీని సేవలను వినియోగించుకుంటున్నారు. అయితే ఇపుడు ఈ రిఫ్రిజిరేటర్ గొడవ ఎందుకొచ్చింది అంటే.. ప్రస్తుతం పాత కాలపు ఫ్రిడ్జ్ వీడియో Social Mediaలో తెగ వైరల్ అవుతోంది. అది చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటి వాటి కంటే పాత కాలపు Refrigerator‌ ఏ సో బెటర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.



64ఏళ్ల క్రితంతో పోల్చితే ప్రస్తుతం శాస్త్రసాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందాం. ఇపుడున్న టెక్నాలజీతో గతం కంటే మెరుగైన సౌకర్యాలను, పరికరాలను తయారు చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతం ఫ్రిడ్జ్‌లు మన అవసరాలన్నింటినీ తీర్చుతున్నాయా? అంటే నిజంగా లేదనే చెప్పాలి. ఒక రిఫ్రిజిరేటర్‌లో ఒక ఫీచర్ ఉంటే ఒక ఫీచర్ ఉండదు. ఎవరో కొందరు తప్ప చాలా మంది ప్రజలు.. కాంప్రమైజై వాటిని కొనుగోలు చేస్తున్నారు. కానీ ఇపుడు వీడియో ద్వారా Viral అవుతున్న 1958నాటి ఫ్రిడ్జ్‌లో అలాంటి సమస్యేమీ లేదు. కూల్ డ్రింక్ బాటిల్స్ దగ్గర నుంచి వెన్న, కూరగాయలు ఇలా రకరకాల పదార్థలు భద్రపర్చుకోవడానికి ప్రత్యేక క్యాబిన్‌లు ఉన్నాయి. ఐస్‌క్యూబ్స్ కోసం ఫ్రీజర్‌లో ఎక్కవ మొత్తంలో ట్రేలు ఉండటంతో పాటు వాటిని సులభంగా పొందేందుకు అవసరమైన ప్రత్యేకమైన అమరిక ఆ ఫ్రిడ్జ్ ఉంది. నిజంగా దీన్ని చూస్తే వావ్ అనాల్సిందే. పాతకాలపు ఫ్రిడ్జ్‌కు సంబంధించిన Videoను కొందరు ‘లాస్ట్ ఇన్ హిస్టరీ’ అనే ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేయగా.. కేవలం 48 గంటల్లోనే 9.2 మిలియన్ల మంది దాన్ని వీక్షించారు. ఈ క్రమంలో స్పందిస్తున్న కొందరు నెటిజన్లు.. ‘1958 కాలం నాటి రిఫ్రిజిరేటరే సో బెటర్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. 




Updated Date - 2022-07-24T20:00:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising