ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు పక్కన నిలబడ్డ యువకుడు.. లిఫ్ట్ ఇస్తాననగానే ఓ కారు ఎక్కిన అతడికి షాకింగ్ అనుభవం..

ABN, First Publish Date - 2022-07-05T21:46:11+05:30

అతను తన ఇంటికి వెళ్లేందుకు సోమవారం అర్ధరాత్రి రోడ్డు పక్కన నిలబడి వాహనం కోసం చూస్తున్నాడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అతను తన ఇంటికి వెళ్లేందుకు సోమవారం అర్ధరాత్రి రోడ్డు పక్కన నిలబడి వాహనం కోసం చూస్తున్నాడు.. ఆ సమయంలో ఒక కారు అతని ముందుకు వచ్చి ఆగింది.. లిఫ్ట్ ఇస్తాం రమ్మని లోపల ఉన్న వ్యక్తి పిలిచాడు.. వారిని నమ్మి కారు ఎక్కిన వ్యక్తికి షాకింగ్ అనుభవం ఎదురైంది.. లోపల ఉన్న ఇద్దరు వ్యక్తులు అతడికి తుపాకీ చూపించి బెదిరించి డబ్బులు ఇమ్మని అడిగారు.. దాంతో అతను కదులుతున్న కారులో నుంచి దూకేశాడు.. అయినా వారు వదలకుండా కారు ఆపి ఆ యువకుడిని పట్టుకుని అతడి వద్ద ఉన్న రూ.15 వేలు పట్టుకుని పారిపోయారు. 


ఇది కూడా చదవండి..

అరగంటలో కోటి రూపాయలు కొట్టేశారు.. అచ్చం సినిమాల్లో జరిగినట్టుగానే..


హర్యానాలోని బహదూర్‌గఢ్‌ నగరానికి సమీపంలో పుట్టి గ్రామానికి చెందిన అమీర్ సోమవారం రాత్రి 2 గంటల ప్రాంతంలో దుజానా నుంచి బహదూర్‌గఢ్‌లోని సెక్టార్‌-2కి వెళ్లేందుకు వాహనం కోసం చూస్తూ రోడ్డు పక్కన నిలబడ్డాడు. ఇంతలో నల్ల రంగు శాంత్రో కారు అతని దగ్గర ఆగింది. కారులో ఇద్దరు యువకులు కూర్చున్నారు. లిఫ్ట్ ఇస్తాం రమ్మని అమీర్‌ను కారు ఎక్కించుకున్నారు. కొంత దూరం వెళ్లాక తుపాకీ తీసి అమీర్‌ను బెదిరించారు. బ్యాగ్‌లో ఉన్న డబ్బులు ఇవ్వాలని అడిగారు. దీంత అమీర్ కదులుతున్న కారులో నుంచి దూకేశాడు. 


కారు నుంచి దూకేసి కొంత దూరం కూడా పరిగెత్తాడు. అయినా దుండగులు అతణ్ని వెంబడించి పట్టుకున్నారు. అతని వద్ద నుంచి రూ.15వేలు లాక్కొని పరారయ్యారు. అమీర్ వెంటనే పోలీసు స్టేషన్‌కు చేరుకుని జరిగిన ఘటన గురించి సమాచారం అందించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2022-07-05T21:46:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising