ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Independence day: స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు బ్రిటిష్ అధికారికి చెంపదెబ్బ.. కారణమేంటో చెప్పిన 108 ఏళ్ల వృద్ధుడు

ABN, First Publish Date - 2022-08-20T03:03:51+05:30

దేశవ్యాప్తంగా 75వ సాతంత్ర్య దినోత్సవ (Independence Day) వేడుకలు ఘనంగా జరిగాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేశవ్యాప్తంగా 75వ సాతంత్ర్య దినోత్సవ (Independence Day) వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రజలందరిలో దేశభక్తి భావన ఉప్పొంగింది. స్వాతంత్ర్యం కోసం జీవితాలను త్యాగం చేసిన యోధులను జాతి మొత్తం ఘనంగా స్మరించుకుంది.  బ్రిటీషర్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం గురించి తెలిసిన వారు చాలా తక్కువ మంది మాత్రమే జీవించి ఉన్నారు. అలాంటి వారిలో ఇమాముద్దీన్ ఖురేషీ ఒకరు. ఆయన బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడాడు. ప్రస్తుతం 108 ఏళ్ల వయసు కలిగిన ఇమాముద్దీన్ ఓ ఆసక్తికర ఘటనను పంచుకున్నారు. 


ఇది కూడా చదవండి..

Viral Video: ఈ వీడియోలో మృగం ఎవరు? ఫైర్ అవుతున్న నెటిజన్లు!


`భారతదేశానికి త్వరలో స్వాతంత్ర్యం వస్తుందని తెలియగానే సంబరాలు చేసుకోవడానికి ప్రజలందరూ వీధుల్లోకి వచ్చారు. త్రివర్ణ పతాకాలతో ర్యాలీలలో పాల్గొన్నారు. బ్రిటీష్ అధికారులు అలాంటి దృశ్యాలను చూసి ఆగ్రహం చెంది లాఠీచార్జి ప్రకటించేవారు. 1947 ఆగస్టు 12.. భారతదేశం అధికారికంగా బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందటానికి మూడు రోజుల ముందు.. హిందువులు, ముస్లింలు ర్యాలీలో పాల్గొన్నారు. బ్రిటిషర్లు ఆ ర్యాలీని అడ్డుకుని లాఠీచార్జి చేశారు. 


నేను తీవ్ర ఆగ్రహానికి గురై ఒక బ్రిటీష్ అధికారిని చెంపపై కొట్టాను. అతను నన్ను, నా సహచరులను అరెస్టు చేశాడు. మూడు రోజుల తర్వాత బ్రిటిష్ వారు దేశం విడిచిపెట్టి వెళ్లిపోయారు. దాంతో నేను జైలు నుంచి విడుదలై ఇంటికి వెళ్లాను. అప్పటికి నా వయస్సు సుమారు 24 ఏళ్లు` అని ఇమాముద్దీన్ తెలిపారు. 

Updated Date - 2022-08-20T03:03:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising