ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి

ABN, First Publish Date - 2022-11-23T00:15:08+05:30

సిరిసిల్ల సెస్‌ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, ప్రచారం వంటి అంశాలపై ఎన్నికల సన్నాహక కమిటీ ఏర్పాటు చేశామని, సెస్‌ ఎన్నికల్లో రైతులు, వినియోగదారులు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని టీపీసీసీ మాజీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. మంగళవారం సిరిసిల్ల రేణుకాదేవి ఫంక్షన్‌హాల్‌లో సెస్‌ ఎన్నికలపై జిల్లా స్థాయి కాంగ్రెస్‌ సమావేశం నిర్వహించారు.

సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మాట్లాడుతున్న పొన్నం ప్రభాకర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిరిసిల్ల, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): సిరిసిల్ల సెస్‌ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, ప్రచారం వంటి అంశాలపై ఎన్నికల సన్నాహక కమిటీ ఏర్పాటు చేశామని, సెస్‌ ఎన్నికల్లో రైతులు, వినియోగదారులు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని టీపీసీసీ మాజీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. మంగళవారం సిరిసిల్ల రేణుకాదేవి ఫంక్షన్‌హాల్‌లో సెస్‌ ఎన్నికలపై జిల్లా స్థాయి కాంగ్రెస్‌ సమావేశం నిర్వహించారు. వివిధ మండలాల నుంచి వచ్చిన ముఖ్య నాయ కులకు మార్గ నిర్దేశనం చేశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సెస్‌ రిజర్వేషన్‌ ప్రక్రియ పూర్తయిన వెంటనే జిల్లాలోని మండల స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తామని, స్థానిక నాయకత్వం ఉన్న అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియ చేపడుతామని అన్నారు. ధైర్యం ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగానే సెస్‌కు ఎన్నికలు నిర్వహించాలని గతంలో కోరామన్నారు. ప్రభుత్వం దొడ్డిదారిన కమిటీ వేసినా చెంపమీద కొట్టినట్లుగా న్యాయస్థానం రద్దు చేసిందన్నారు. రైతుల వద్దకు వెళ్లి ముఖం చూపించుకునే పరిస్థితి లేకపోవడంతోనే ప్రభుత్వం సెస్‌కు ఎన్నికలు నిర్వహించ లేదన్నారు. రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీ అమలు చేయలేదని, అనేక సబ్సిడీలు ఇవ్వడం లేదని అన్నారు. రైతుల పక్షాన కాంగ్రెస్‌ నిలబడడంతోనే ధాన్యం కొనుగోలు చేస్తున్నారన్నారు. ధాన్యం కొనుగోళ్లలో అదనంగా తూకం వంటి అనేక సమస్యలతో రైతులను ఇబ్బందులు పెడుతున్నారన్నారు. సెస్‌ ఎన్నికల్లో ప్రభుత్వానికి గట్టిగా బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. సెస్‌లో అనేక అవకతవకలు, అవినీతి జరుగుతున్నా స్థానిక పార్లమెంట్‌ సభ్యుడు ఒక్కనాడు కూడా సమీక్షించలేదన్నారు. కాంగ్రెస్‌ చేసిన ఫిర్యాదుల మేరకు అవకతవకల్లో పలువురు సస్పెండ్‌ అయ్యారని గుర్తు చేశారు. సెస్‌ ఎన్నికల్లో ల్యాండ్‌, మైనింగ్‌, స్యాండ్‌, వైన్‌మాఫియాకు చెందిన వారు అభ్యర్థులుగా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. కేటీఆర్‌కు సవాల్‌ విసురుతున్నానని, వేములవాడ రాజన్న మెట్ల వద్ద ప్రమాణం చేసి ప్రజాస్వామ్యబద్ధంగా డబ్బులు వెదజల్లకుండా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిద్దామని అన్నారు. కొత్తగా ఏర్పడిన మండలాల వారు తమకూ ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారని, వారిని స్వాగతిస్తున్నామని అన్నారు. వారికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఎన్నికలు వాయిదా వేయకుండా కొత్త మండలాల్లో స్థానాలు పెంచాలని కోరారు. సమావేశంలో కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ, పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆది శ్రీనివాస్‌, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు కూస రవీందర్‌, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, కాంగ్రెస్‌ మహిళా ఽఅధ్యక్షురాలు కాముని వనిత, జడ్పీటీసీ నాగం కుమార్‌ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సూర దేవరాజు, సెస్‌ మాజీ చైర్మన్‌ జగన్మోహన్‌రెడ్డి, తంగళ్లపల్లి అధ్యక్షుడు జాల్గం ప్రవీణ్‌కుమార్‌, ఎల్లారెడ్డిపేట అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, గంభీరావుపేట అధ్యక్షుడు హమీద్‌, వేములవాడ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి, వేములవాడ రూరల్‌ అధ్యక్షుడు పిల్లి కనకయ్య, బోయినపల్లి అధ్యక్షుడు వన్నెల రమణారెడ్డి, ముస్తాబాద్‌ అధ్యక్షుడు బాల్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, ఫిరోజ్‌ఖాన్‌, యువజన కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-23T17:37:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising