Gujarat: బీజేపీతో కలిసి వెళ్లాలని ఆప్ ఎమ్మెల్యే సూచన
ABN, First Publish Date - 2022-12-15T07:13:54+05:30
గుజరాత్ రాష్ట్రం నుంచి కొత్తగా ఎన్నికైన ఐదుగురు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను...
కేజ్రీవాల్‌తో గుజరాత్ ఆప్ ఎమ్మెల్యేల భేటీ
న్యూఢిల్లీ: గుజరాత్ రాష్ట్రం నుంచి కొత్తగా ఎన్నికైన ఐదుగురు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను ఆయన నివాసంలో కలిశారు.(Gujarat AAP MLAs)ఈ సమావేశంలో పలు కీలక సమస్యల పరిష్కారానికి బీజేపీతో కలిసి వెళ్లవచ్చని ఆప్ పార్టీ ఎమ్మెల్యే భూపత్ భయానీ మొదట సూచించారు. అయితే తర్వాత అన్ని ఊహాగానాలను పక్కన పెడుతూ తాను ఆప్ పార్టీ పట్ల అసంతృప్తిగా లేనని వివరణ ఇచ్చారు. కేజ్రీవాల్‌ను(ArvindKejriwal) కలిసిన(Meet) వారిలో భయానీతో పాటు చైతర్‌భాయ్ వాసవ, హేమంత్‌భాయ్ హర్దాస్‌భాయ్, సుధీర్ బఘని, మక్వానా నారన్‌భాయ్ ఉన్నారు.
మర్యాద పూర్వక భేటీ
ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ యూనిట్ ప్రెసిడెంట్ గోపాల్ ఇటాలియా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనోజ్ సొరాథియా, పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇసుదన్ గాధ్వి, ఇతర నాయకులు కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులతో కలిసి కేజ్రీవాల్ తో సమావేశమయ్యారు.జాతీయ కన్వీనర్‌తో మర్యాదపూర్వకమైన భేటీ అని ఇటాలియా చెప్పారు.
ఆప్ విస్తరణపై చర్చ
గుజరాత్ రాష్ట్రంలో ఆప్ పార్టీని మరింత విస్తరించే వ్యూహంపై చర్చించారని ఆప్ వర్గాలు తెలిపాయి.‘‘గుజరాత్ నుంచి కొత్తగా ఎన్నికైన ఆప్ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యాను. వారు గుజరాత్ ప్రజలకు అవిశ్రాంతంగా సేవ చేస్తారని భావిస్తున్నాను. వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’’ అని కేజ్రీవాల్ పార్టీ శాసనసభ్యుల ఫోటోతో పాటు ట్వీట్(Tweet) చేశారు.ఇటీవల ముగిసిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఐదు స్థానాలను గెలుచుకుని దాదాపు 13 శాతం ఓట్లను సాధించింది.రాజ్యసభ సభ్యుడు కూడా అయిన పార్టీ ఎన్నికల వ్యూహకర్త సందీప్ పాఠక్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
Updated Date - 2022-12-15T07:13:55+05:30 IST