ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సైనికుడు రాసిన ఉత్తరం... 76 ఏళ్ల తరువాత డెలివరీ.. !

ABN, First Publish Date - 2022-01-08T03:44:07+05:30

డబ్భై ఆరేళ్ల క్రితం ఓ సైనికుడు తన తల్లికి రాసిన ఉత్తరాన్ని అమెరికా తపాలా శాఖ ఇన్నాళ్ల తరువాత డెలివరీ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: డబ్భై ఆరేళ్ల క్రితం ఓ సైనికుడు తన తల్లికి రాసిన ఉత్తరాన్ని అమెరికా తపాలా శాఖ ఇన్నాళ్ల తరువాత డెలివరీ చేసింది. ఉత్తరాల డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో ఉన్న లేఖను గుర్తించిన అధికారులు..దాన్ని ఆ సైనికుడి భార్యకు చేరవేశారు. ఉత్తరం రాసిన సైనికుడు జాన్ గొన్సాల్వెస్ 2015లో మృతి చెందారు. ఆయన తల్లి కూడా అంతకు కొన్నేళ్ల ముందే కన్నూమూశారు. అయితే.. జాన్ భార్య ఆచూకీ కనుక్కున్న పోస్టల్ శాఖ వారు ఇటీవలే ఆమెకు ఈ ఉత్తరాన్ని అందించారు. ‘‘అమ్మా..  ఇక్కడ అంతా బాగుంది. అక్కడ నువ్వు కూడా క్షేమంగానే ఉన్నావని ఆశిస్తున్నాను. అయితే.. ఇక్కడ ఆహారం మాత్రం విసుకుపుట్టిస్తోంది. ’’ అంటూ అప్పట్లో 22 ఏళ్ల వయసున్న జాన్ తన తల్లికి ఉత్తరం రాశారు. కాగా.. ఈ ఉత్తరం తమకెంతో విలువైనదంటూ పోస్టల్ శాఖ వారూ కూడా జాన్ భార్యకు మరో సందేశాన్ని పంపించారు. ఇన్నాళ్ల తరువాత.. తన భర్త దస్తూరి కంట పడటంతో గొన్సాల్వెస్ భార్య సంతోషపడ్డారు. మళ్లీ భర్తను చూసుకున్నట్టు ఉందని వ్యాఖ్యానించారు. కాగా.. ఈ లేఖ రాసిన ఐదేళ్ల తరువాత.. జాన్ గొన్సాల్వెస్ తన కాబోయే భార్యను కలుసుకున్నారు. 

Updated Date - 2022-01-08T03:44:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising