ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆఫీసు పూర్తయ్యాక ఇక బాస్‌ను పట్టించుకోనక్కర్లేదు.. బెల్జియంలో కొత్త రూల్

ABN, First Publish Date - 2022-01-23T02:51:19+05:30

ఉద్యోగుల వెతలు గమనించిన బెల్జియం ప్రభుత్వం వారికి ఊరటనిచ్చే సరికొత్త నిబంధనను తీసుకొచ్చింది. ఈ కొత్త రూల్ ప్రకారం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: వర్క్ ఫ్రం హోం దెబ్బకు అనేక దేశాల్లోని ఉద్యోగులు జీవితం తల్లికిందులైపోయింది. నిరంతరం బాస్‌కు అందుబాటులో ఉండాల్సి రావడంతో వ్యక్తిగత వృత్తిగత జీవితాల మధ్య సరిహద్దు చెరిగిపోయే పరిస్థితి నెలకొంది. అనేక మందిలో అసహనం పతాకస్థాయికి చేరుకుంది. అయితే.. ఉద్యోగుల వెతలు గమనించిన బెల్జియం ప్రభుత్వం వారికి ఊరటనిచ్చే సరికొత్త నిబంధనను తీసుకొచ్చింది. ఈ కొత్త రూల్ ప్రకారం..  ఆఫీసులో తమ షిఫ్టులు పూర్తైన తరువాత ఉద్యోగులు ఇకపై బాస్‌లు, పైఅధికారుల సందేశాలకు, ఫోన్లకు స్పందించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. ఉద్యోగులు స్పందించని సందర్భాల్లో యాజమాన్యాలు వారికి ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు సృష్టించకూడదని స్పష్టం చేసింది. మరోవైపు.. అత్యవసర సందర్భాల్లో ఉద్యోగుల్ని సంప్రదించే వెసులుబాటును యాజమాన్యాలకు కూడా ప్రభుత్వం ఇచ్చింది. ఫిబ్రవరి 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. అయితే.. ఈ నిబంధన ప్రస్తుతం ప్రభుత్వోద్యోగులకు మాత్రమే పరిమితం. మరి ప్రైవేటు రంగంలోని వారికి కూడా ఇది వర్తిస్తుందా లేదా అనే దానిపై మాత్రం ఇంకా స్పష్టత లేదు. 

Updated Date - 2022-01-23T02:51:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising