ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళల విషయంలో Saudi Arabia మరో సంచలన నిర్ణయం..!

ABN, First Publish Date - 2022-01-08T13:40:48+05:30

కొన్నేళ్ల క్రితం అరబ్ దేశం సౌదీ అరేబియా మహిళల విషయంలో ఎక్కడలేని చట్టాలు అమలు చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రియాద్: కొన్నేళ్ల క్రితం అరబ్ దేశం సౌదీ అరేబియా మహిళల విషయంలో ఎక్కడలేని చట్టాలు అమలు చేసింది. కానీ, గడిచిన నాలుగైదేళ్ల నుంచి మహిళలకు సంబంధించి పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. మహిళలకు డ్రైవింగ్, ఆర్మీలో చేరడం, మగతోడు లేకుండా ఒంటరిగా ప్రయాణాలతో పాటు ఇటీవల సౌదీ రైల్వే పాలిటెక్నిక్(ఎస్‌ఆర్‌పీ) ప్రాజెక్ట్‌లో భాగంగా మహిళలను ట్రైన్స్ నడిపేందుకు కూడా అవకాశం కల్పించింది. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై సౌదీ మహిళలు ట్యాక్సీలు కూడా నడపొచ్చు. ఈ మేరకు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ ట్విటర్ ద్వారా కీలక ప్రకటన చేసింది. 


మహిళలు జనరల్ ట్యాక్సీ లైసెన్స్ కోసం దేశంలోని రియాద్, జెడ్డా, జజాన్, అసిర్, నజ్రాన్, జౌఫ్, హైల్, తైఫ్ నగరాల్లోని 18 డ్రైవింగ్ స్కూల్స్‌లో ఎక్కడైనా దరఖాస్తు చేసుకోవచ్చని ట్వీట్‌లో పేర్కొంది. లైసెన్స్ దరఖాస్తు రుసుమును 200 సౌదీ రియాళ్లుగా(రూ.3,959) నిర్ణయించినట్లు ట్రాఫిక్ విభాగం వెల్లడించింది. ఇదిలాఉంటే.. 2018లో మొదటిసారి మహిళలకు డ్రైవింగ్ చేసే వీలు కల్పిస్తూ సౌదీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత మహిళలకు విమానాలు, రేసింగ్ కార్లు, రైళ్లు నడిపేందుకు కూడా అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే.  

Updated Date - 2022-01-08T13:40:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising