ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral News: బ్యాంకు ముందు 5గంటలు భిక్షాటన చేస్తేనే ఆమెకు అన్నం.. ఇదంతా వారం క్రితం వరకు.. ప్రస్తుతం ఆమె రేంజ్ ఏంటంటే..

ABN, First Publish Date - 2022-08-10T21:35:09+05:30

బ్యాంకు, సూపర్ మార్కెట్‌ల ముందు నిల్చుని అక్కడకు వచ్చే కస్టమర్ల వద్ద భిక్షాటన చేస్తూ బతకడమే ఆమె చేసే పని. ఇదంతా వారం క్రితం వరకు. ఇప్పుడు ఆమె రేంజ్ మారిపోయింది. ఒకే ఒక్క పనితో ఆమె కోటీశ్వరురాలైంది. దీంతో ప్రస్తుతం ఆమె అంశం అమెరి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: బ్యాంకు, సూపర్ మార్కెట్‌ల ముందు నిల్చుని అక్కడకు వచ్చే కస్టమర్ల వద్ద భిక్షాటన చేస్తూ బతకడమే ఆమె చేసే పని. ఇదంతా వారం క్రితం వరకు. అయితే ఇప్పుడు ఆమె రేంజ్ మారిపోయింది. ఒకే ఒక్క పనితో ఆమె కోటీశ్వరురాలైంది. దీంతో ప్రస్తుతం ఆమె అంశం అమెరికాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


ఫ్లోరిడాలో నివసిస్తున్న ఓ మహిళ.. అక్కడ ఓ వీధిలో ఉన్న బ్యాంకు, సూపర్ మార్కెట్‌ల వద్ద ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భిక్షాటన చేసేది. అలా భిక్షం ద్వారా వచ్చిన డబ్బులను నిత్యావసరాలు తీర్చుకోవడానికి ఉపయోగించుకునేది. ఈ క్రమంలోనే ఎప్పటిలాగే గత గురువారం బ్యాంకు, సూపర్ మార్కెట్‌ల వద్దకు వచ్చిన కస్టమర్ల వద్ద భిక్షాటన చేసిన ఆమె.. తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే పక్కనే ఉన్న షాపునకు వెళ్లి, ఓ స్పానిష్ లాటరీ టికెట్‌ను కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలోనే ఆమెను అదృష్టం వరించింది. లక్కీ డ్రాలో ఆమె కొనుగోలు చేసిన లాటరీ టికెట్‌కు జాక్‌పాట్ తగిలింది. 1.3మిలియన్ డాలర్లు(రూ.10.32కోట్లు) గెలుచుకుంది. దీంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. 



ఈ విషయాన్ని ఆమెకు లాటరీ టికెట్ అమ్మినటువంటి షాపు యజమాని స్పష్టం చేశాడు. రొమేనియాకు చెందిన మహిళ‌కు జాక్‌పాట్ తగిలిందన్నాడు. విషయం తెలిసిన తర్వాత ఆమె తన షాప్‌ను మళ్లీ విజిట్ చేసినట్టు చెప్పాడు. గెలుచుకున్న డబ్బుతో తన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని చెబుతూ ఆనందం వ్యక్తం చేసినట్టు తెలిపాడు. దీంతో ఆమెకు సంబంధించిన వార్త ప్రస్తుతం ఆమెరికాలో చర్చనీయాంశం అయింది. 


Updated Date - 2022-08-10T21:35:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising