ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అగ్రరాజ్యంలో భారత సంతతి మహిళకు అరుదైన గౌరవం

ABN, First Publish Date - 2022-02-05T16:54:11+05:30

అగ్రరాజ్యం అమెరికాలో భారత సంతతి మహిళకు అరుదైన గౌరవం దక్కింది. కాలిఫోర్నియా సర్జన్ జనరల్‌గా భారత సంతతికి చెందిన దేవికా భూషణ్ నియమితులయ్యారు. కాలిఫోర్నియా సర్జన్ జనరల్‌గా నాడిన్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: అగ్రరాజ్యం అమెరికాలో భారత సంతతి మహిళకు అరుదైన గౌరవం దక్కింది. కాలిఫోర్నియా సర్జన్ జనరల్‌గా భారత సంతతికి చెందిన దేవికా భూషణ్ నియమితులయ్యారు. కాలిఫోర్నియా సర్జన్ జనరల్‌గా నాడిన్ బర్క్ హారిస్ పదవీ విరమణ చేశారు. ఈ నేపథ్యంలో ఆమె స్థానాన్ని దేవికా భూషణ్ భర్తీ చేశారు. కొలంబియాలో అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన దేవికా భూషణ్.. హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లో ఎండీ చేశారు. అంతేకాకుండా జాన్స్ హాప్కిన్స్ బ్లూమ్‌బర్గ్ చిల్డ్రన్స్ సెంటర్‌లో దేవికా భూషణ్.. జనరల్ పీడియాట్రిక్స్ రెసిడెన్సీని పూర్తి చేశారు. ఇదిలా ఉంటే.. దేవికా భూషణ్ తండ్రి పేరు ఇందు భూషణ్. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్ మిషన్ తొలి సీఈఓగా ఇందు భూషణ్ పని చేశారు. 




Updated Date - 2022-02-05T16:54:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising