ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎయిర్‌హోస్టెస్ ఉద్యోగానికి ఇంటర్వ్యూ... ఎవరూ ఊహించని తప్పిదానికి పాల్పడిన యువతి..చివరకు..

ABN, First Publish Date - 2022-02-12T02:45:33+05:30

టర్వ్యూలకు హాజరయ్యే సమయంలో ఉద్యోగార్థులు అప్పుడప్పుడూ తడబడుతుంటారు. ఇది సహజమే. అయితే.. ఫ్లైట్ అటెండెంట్ ఉద్యోగానికి అప్లై చేసిన ఓ యువతి.. కలలో కూడా ఊహించలేని తప్పిదానికి పాల్పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో ఉద్యోగార్థులు అప్పుడప్పుడూ తడబడుతుంటారు. ఇది సహజమే. అయితే.. ఫ్లైట్ అటెండెంట్ ఉద్యోగానికి అప్లై చేసిన ఓ యువతి.. ఎవరూ కలలో కూడా ఊహించలేని తప్పిదానికి పాల్పడింది. ఏకంగా ఇంటర్వూ చేసిన సంస్థనే అవహేళన చేస్తూ ఓ వీడియో క్లిప్పింగ్‌ను పంపించింది. అనుకోకుండా ఈ పొరపాటు జరిగినా కూడా చివరికి జరగవలసిన అనర్థం జరిగిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. 


అమెరికాకు చెందిన షేలీన్ మార్టీనెస్.. స్కైవెస్ట్ ఎయిర్‌లైన్స్‌లో ఫ్లైట్ అటెండెంట్ ఉద్యోగానికి దరఖాస్తు చేసింది. వర్చువల్ విధానంలో జరిగిన ఇంటర్వ్యూలో సంస్థ వేసిన  ప్రశ్నలకు ఆమె సమాధానాలు రికార్డు చేసి పంపించాలి. అయితే.. సమాధానం చెప్పేందుకు ఆమె తన స్నేహితురాలి సహాయం తీసుకుందామనుకుని ఆమెకు ఫోన్ చేసింది. ఇంటర్వ్యూలో అడిగిన ఓ ప్రశ్న తనకు చాలా చెత్తప్రశ్నలా తోచిందంటూ ఫోన్ కాల్‌లో తన మనసులోని మాటను బయటపెట్టేసింది. అయితే.. అప్పటికే కెమెరా రికార్డింగ్ ప్రారంభమవడంతో.. ఆమె వ్యాఖ్యలన్నీ సంస్థకు చేరిపోయాయి. కెమెరా రికార్డింగ్ ప్రారంభమైన విషయాన్ని చాలా సేపటివరకూ ఆమె గుర్తించకపోవడంతో.. సంస్థను అవహేళన చేసిన క్లిప్ మొత్తం వారికి చేరిపోయింది. జరిగిన పొరపాటును  చాలా సేపటి తరువాత గుర్తించిన ఆమె ఒక్కసారిగా విస్తుపోయింది. ఇక తాను చేయగలిగిందేమీ లేదని గుర్తించిన షేలీన్ చివరికి ఆ వీడియోను టిక్‌టాక్‌లో పెట్టడంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవుతోంది. 



Updated Date - 2022-02-12T02:45:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising