ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్పెషల్‌గా ఉండాలని 1000 అక్షరాలో కూతురికి పేరు.. టేప్ రికార్డర్‌లో రికార్డు చేసి మరీ..

ABN, First Publish Date - 2022-01-05T23:10:14+05:30

తల్లిదండ్రులు ఎవరైనా సాధారణంగా తమ పిల్లలకు మంచి అర్థవంతమైన పేరును పెట్టాలనుకుంటారు. స్పెషల్‌గా ఉండాలనే ఉద్దేశంతో పిల్లలే ఆ పేరును కంఠతాపట్టేంత పెద్దగా పెట్టాలని ఎవ్వరూ అనుకోరు. అయితే.. కూతురిని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: తల్లిదండ్రులు ఎవరైనా సాధారణంగా తమ పిల్లలకు మంచి అర్థవంతమైన పేరును పెట్టాలనుకుంటారు. స్పెషల్‌గా ఉండాలనే ఉద్దేశంతో పిల్లలే ఆ పేరును కంఠతాపట్టేంత పెద్దగా పెట్టాలని ఎవ్వరూ అనుకోరు. అయితే.. కూతురిని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం వారికి లేనప్పటికీ.. ఆ దంపతులు మాత్రం ఇదే చేశారు. ఏకంగా వెయ్యికిపైగా అక్షరాలతో తమ బిడ్డకు పేరు పెట్టేశారు. వాళ్లు చేసిన పనికి ఏకంగా ప్రభుత్వమే బెదిరిపోయింది. దీంతో పేర్ల నిడివి విషయంలో చట్టాన్నే తీసుకొచ్చింది. ఆశ్చర్యంగా అనిపించినా.. ఇది నిజం. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన సాండ్రా విలియమ్స్ దంపతులు సెప్టెంబర్ 12, 1984లో కూతురికి జన్మనిచ్చారు. సాండ్ర విలియమ్స్ దంపతులు మొదట తమ కూతురికి దాదాపు 30అక్షరాల పేరు పెట్టారు. ఆ పేరుతో బర్త్ సర్టిఫికెట్ కూడా తీసుకున్నారు. కానీ.. ఆ తర్వాత వారు తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు. ప్రపంచలో ఎవరికీ ఉండకూడనంత పెద్దగా తమ కూతురి పేరు ఉండాలని ఆశపడ్డారు. ఈ క్రమంలోనే 1,019 అక్షరాలతో ప్రపంచంలోనే అతిపొడవైన పేరును తమ అమ్మాయికి పెట్టేశారు. అనంతరం తిరిగి కూతురి బర్త్‌ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేశారు. ఈ క్రమంలో సుమారు రెండు అడుగుల పొడవైన బర్త్ సర్టిఫికెట్‌ను అధికారులు ఆ దంపతులకు అందించారు.


ఈ ఘటన తర్వాత సర్టిఫికెట్‌లోని బాక్సులో పట్టేంత పేర్లను మాత్రమే  పెట్టాలని అక్కడి ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. పెరిగి పెద్దయిన తర్వాత ఆ అమ్మాయి తన పేరును గుర్తుపెట్టుకోవడానికి అనేక ఇబ్బందులు పడింది. ప్రత్యేకంగా టేప్ రికార్డర్‌లో పేరును రికార్డు చేసి, మాటి మాటికీ వింటూ తన పేరును కంఠతాపట్టింది. కాగా.. ఆమె తల్లిదండ్రుల కల మాత్రం ఎట్టకేలకు నెరవేరింది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన పేరు పెట్టుకున్నందుకుగాను తమ కూతురు గిన్నీస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కింది. స్పెషల్‌గా ఉండాలని వెయ్యి అక్షరాలతో పేరు పెట్టినప్పటికీ.. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు అందరూ.. ఆమెను మాత్రం ముద్దుగా జామీ అని పిలుచుకుంటారట.




Updated Date - 2022-01-05T23:10:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising