ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంత కోపం వస్తే మాత్రం.. మరీ ఇలానా.. అడిగింది ఇవ్వలేదని మెడికల్ షాపులో పని చేస్తున్న Pharmacist‌ను మహిళ..

ABN, First Publish Date - 2022-07-16T16:41:00+05:30

పొట్ట కూటి కోసం అతడు దేశం కాని దేశం వచ్చాడు. సౌదీ అరేబియాలో ఫార్మ‌సిస్ట్‌గా పని చేస్తూ.. తండ్రి క్యాన్సర్ చికిత్సకు అవసరమైన డబ్బులు సంపాదిస్తూ.. కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇంతలో ఘోరం జరిగిపోయింది. మహిళ కోపానికి అతడు ప్రా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: పొట్ట కూటి కోసం అతడు దేశం కాని దేశం వచ్చాడు. సౌదీ అరేబియాలో ఫార్మ‌సిస్ట్‌గా పని చేస్తూ.. తండ్రి క్యాన్సర్ చికిత్సకు అవసరమైన డబ్బులు సంపాదిస్తూ.. కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇంతలో ఘోరం జరిగిపోయింది. మహిళ కోపానికి అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఇంతకూ ఏం జరిగిందనే పూర్తి వివరాల్లోకి వెళితే..



ఈజిప్ట్‌కు చెందిన అహ్మద్ అతేమ్.. ఉపాధి కోసం గత ఏడాది సౌదీ అరేబియా వెళ్లాడు. అక్కడ ఓ మెడికల్ షాపులో ఫార్మాసిస్ట్‌గా పని చేస్తున్నాడు. ఇలా పని చేయడం ద్వారా వచ్చిన డబ్బులతోనే కుటుంబాన్ని పోషించుకోవడంతోపాటు క్యాన్సర్ బారిన పడిన తన తండ్రికి చికిత్స చేయిస్తున్నాడు. అయితే.. అహ్మద్.. ఓ మహిళ కోపానికి బలైపోయాడు. సౌదీ అరేబియాలో నిబంధనలు కఠినంగా ఉంటాయన్న విషయం తెలిసిందే. ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇవ్వడం సౌదీ అరేబియాలో నేరం. అందువల్ల  ప్రిస్క్రిప్షన్ మెడికల్ షాపునకు వచ్చిన సౌదీ మహిళకు.. యాంటిబయోటిక్ మెడిసిన్స్ ఇచ్చేందుకు అతడు నిరాకరించాడు. దీంతో సదరు మహిళ ఆగ్రహానికి గురైంది. బ్యాగులోంచి తుపాకీ తీసి, అతడిపై కాల్పులు జరిపింది. ఈ దాడిలో అహ్మద్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలిసి అతడి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. 


Updated Date - 2022-07-16T16:41:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising