ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRIతో వివాహిత ఎఫైర్.. భర్తను అడ్డు తొలగించుకునేందుకు ప్లాన్..! పథకం ప్రకారమే అంతా చేసినా..

ABN, First Publish Date - 2022-02-27T02:34:11+05:30

NRIతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ వివాహిత భర్తను అడ్డు తొలగించుకునే ప్రయత్నంలో తానే అడ్డంగా పోలీసులకు దొరికిపోయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: NRIతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వివాహిత తన భర్తను అడ్డు తొలగించుకునే ప్రయత్నంలో తానే అడ్డంగా పోలీసులకు దొరికిపోయింది. అంతా పథకం ప్రకారమే చేసినా కూడా పోలీసులకు అనుమానం రావడంతో నిందితురాలి బండారం మొత్తం బయటపడింది. కేరళలో ఇటీవల ఈ ఘటన వెలుగు చూసింది. ఓ రాజకీయ పార్టీకి చెందిన సౌమ్య సునీల్.. ఇడుక్కీ వందనమేడు పంచాయతీలో మెంబర్. ఆమె భర్త పేరు సునీల్ వర్ఘీస్. అయితే.. కొంతకాలం క్రితం ఆమెకు సౌదీలో ఉద్యోగం చేస్తున్న ఎన్నారై వినోద్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. అతడు కూడా వివాహితుడే. ఇద్దరూ కలిసి గతంలో ఓ రెండు రోజుల పాటు విహార యాత్రకు కూడా వెళ్లొచ్చారు. ఈ క్రమంలో తమ వ్యవహారానికి అడ్డుగా ఉన్న భర్తను పక్కకు తప్పించాలని సౌమ్య నిశ్చయించుకుంది.


ఇందుకోసం తన ప్రియుడు వినోద్ సాయం తీసుకుంది. వినోద్, మరో ఇద్దరి సహకారంతో... సునీల్ బైక్‌లో మాదకద్రవ్యాల ప్యాకెట్లు దాచాడు. సునీల్‌పై నేరం మోపే ప్రయత్నం చేశాడు. ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం, పోలీసులకు సమాచారం ఇచ్చి.. సునీల్‌ను మాదకద్రవ్యాల కేసులో అరెస్టు చేయించాడు. అయితే.. విచారణ సందర్భంగా తనకేమీ తెలియదని సునీల్ గట్టిగా వాదించడంతో పోలీసులకు అనుమానాలు మొదలయ్యాయి. చివరికి సునీల్, సౌమ్యల కాల్ రికార్డులను పరిశీలించగా.. సౌమ్యపై సందేహాలు తలెత్తాయి. ఈ క్రమంలో ఆమెను పిలిపించి విచారించగా.. మొత్తం విషయాన్ని నిందితురాలు బయటపెట్టేసింది. దీంతో పోలీసులు నిందితురాలిని ఫిబ్రవరి 25న అరెస్టు చేశారు. ఈ నేరంలో పాలుపంచుకున్న మరో ఇద్దరు వ్యక్తులు కూడా పోలీసులకు చిక్కినా.. వినోద్ కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.



Updated Date - 2022-02-27T02:34:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising