ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గొప్పలు చెప్పుకుంటూ సోషల్ మీడియాలో భార్య పొరపాటున పెట్టిన వీడియోలతో.. భర్త బండారం బట్టబయలు..

ABN, First Publish Date - 2022-06-21T00:26:56+05:30

గొప్పలు చెప్పుకుంటూ సోషల్ మీడియాలో భార్య పొరపాటున పెట్టిన వీడియోలతో.. భర్త బండారం బట్టబయలు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: ఆమె భర్త ఓ బాడీ బిల్డర్..! ఐదేళ్లుగా కసరత్తులు చేస్తూ తన దేహదారుఢ్యాన్ని పెంచుకున్నాడు. అతడు కసరత్తులు చేస్తుండగా తీసిన వీడియోలను ఆయన భార్య సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తెగ మురిసిపోయేది. ఈ సరదానే చివరకు అతడి కొంప ముంచింది. అతడు చేసిన మోసం బయటపడటంతో కోర్టు అతడిని ప్రభుత్వానికి 200000 డాలర్ల నష్టపరిహారాన్ని చెల్లించాలంటూ ఆదేశించింది. అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రంలో వెలుగు చూసిన ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే.. 


లాంగ్ ఐల్యాండ్ ప్రాంతానికి చెందిన రగూసా(52) 2015 నుంచి 2020 వరకూ ప్రభుత్వాన్ని మోసం చేస్తూ వికలాంగులకు ఇచ్చే ప్రభుత్వ సాయం తీసుకున్నాడు. ఉద్యోగ సమయంలో తాను తీవ్రంగా గాయపడ్డానని, తనకు ప్రభుత్వ చేయూత అవసరమని ప్రభుత్వాన్ని కోరడంతో పెన్షన్ మంజూరైంది. తాను ఏపనీ చేసే స్థితిలో లేనని, ముందుకు వంగలేనని, కుర్చీలో 30 నిమిషాలకు మించి కూర్చోలేనంటూ అప్పట్లో రగూసా సాంఘిక సంక్షేమ శాఖ అధికారులను బురిడీ కొట్టించాడు. ఇలా తాను అనుకున్నది సాధించాక.. రగూసా తన మానాన తాను వ్యాయామశాలలో కసరత్తులు చేస్తూ మంచి దేహదారుఢ్యాన్ని సాధించాడు. అంతేకాకుండా.. లగ్జరీ కార్లు అద్దెకు ఇచ్చే ఓ రెంటల్ కంపెనీని కూడా నిర్వహిస్తూ రెండు చేతులా సంపాదించుకున్నాడు. మరోవైపు.. రగూసా భార్య అతడి కసరత్తుల వీడియోలన్నీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ వచ్చింది. 


2017 నుంచి ఇలా తన భర్తకు సంబంధించిన పలు చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ గొప్పలకు పోయింది. ఇటీవల ఇవి అధికారుల దృష్టికి రావడంతో అతడి బండారం మొత్తం బయటపడింది. ఇలా రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన రగూసా చివరకు తాను నేరం చేశానని ఒప్పుకోక తప్పలేదు. దీంతో..  ప్రభుత్వానికి నష్టపరిహారంగా 200,000 డాలర్లు చెల్లించాలంటూ న్యాయస్థానం ఇటీవల అతడిని ఆదేశించింది. 



Updated Date - 2022-06-21T00:26:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising