ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

110 దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి...సంక్షోభం తీరు మారుతోంది.. డబ్ల్యూహెచ్ఓ కామెంట్

ABN, First Publish Date - 2022-07-01T02:41:52+05:30

కరోనా సంక్షోభానికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. 110 దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని హెచ్చరించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: కరోనా సంక్షోభానికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. 110 దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని హెచ్చరించింది. కరోనా సంక్షోభం తీరు మారుతోందే కానీ పూర్తిగా సమసిపోలేదని హెచ్చరించారు. బుధవారం జరిగిన పత్రికా సమావేశంలో ఈ విషయాలను వెల్లడించారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల నమోదు.. వైరస్ జన్యుక్రమ విశ్లేషణ పరీక్షలు తగ్గుతున్నాయి. దీని వల్ల కరోనా వ్యాప్తిని ట్రాక్ చేయడం,  కొత్త వేరియంట్లను గుర్తించడం కష్టంగా మారుతుంది.’’ అని డబ్లూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అథానమ్ హెచ్చరించారు. 


110 దేశాల్లో కరోనా బీఏ.4, బీఏ.5 వేరియంట్ల కారణంగా కేసులు పెరుగుతున్నాయన్నారు. ఫలితంగా ప్రపంచస్థాయిలో కేసుల సంఖ్యలో 20 శాతం పెరుగుదల నమోదవుతోందన్నారు. గ్లోబల్ స్థాయిలో మరణాల రేటు స్థిరంగానే ఉన్నా కొన్ని ప్రాంతాల్లో  మాత్రం పెరుగుదల నమోదైందని పేర్కొన్నారు. జనాభాలో కనీసం 70 శాతానికి టీకా అందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఇప్పటివరకూ 58 దేశాలే ఈ లక్ష్యాన్ని చేరుకున్నాయని చెప్పిన ఆయన.. అల్పాదాయ దేశాలకు ఈ లక్ష్యం చేరుకోవడం సాధ్యం కాకపోవచ్చంటూ ఆందోళన వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-07-01T02:41:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising