ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్ ప్రభావం కొన్ని దశాబ్దాల పాటు ఉంటుంది: ప్రపంచ ఆరోగ్య సంస్థ

ABN, First Publish Date - 2022-02-08T01:36:16+05:30

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి నెమ్మదిస్తున్న దాఖలాలు కనబుడుతున్నప్పటికీ.. రాబోయే కొన్ని దశాబ్దాల పాటు ఈ సంక్షోభ ప్రభావం ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అథానమ్ తాజాగా వ్యాఖ్యానించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి నెమ్మదిస్తున్న దాఖలాలు కనబుడుతున్నప్పటికీ.. రాబోయే కొన్ని దశాబ్దాల పాటు ఈ సంక్షోభ ప్రభావం ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అథానమ్ తాజాగా వ్యాఖ్యానించారు. ఈ సంక్షోభం సుదీర్ఘకాలం కొనసాగే కొద్దీ పర్యవసానాలు మరింత తీవ్రమవుతాయని ఆయన హెచ్చరించారు. కామన్‌వెల్త్ దేశాల్లో కేవలం 42 శాతం జనాభాకు రెండు కరోనా డోసుల అందాయని, టీకా లభ్యత విషయంలో దేశాల మధ్య అంతరాలు ఉన్నాయని టెడ్రోస్ తెలిపారు. తాజాగా జరిగిన ఓ పత్రికాసమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


 కాగా.. అంతకుమునుపు మరో సందర్భంలో టెడ్రోస్ మాట్లాడుతూ.. కరోనా వైరస్‌లో మార్పులు వస్తున్న కొద్దీ టీకాల్లో కూడా మార్పులు రావాలని అభిప్రాయపడ్డారు. పాత టీకాల ద్వారా శరీరంలో సమకూరిన కరోనా నిరోధక యాంటీబాడీల నుంచి కొత్త వేరియంట్లు తప్పించుకోవచ్చని కూడా తెలిపారు. గతంలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటన ప్రకారం..జంతువులకు పోకే బీటా కరోనా వైరస్ రకాల సంఖ్య చాలా ఎక్కువ. అంతేకాకుండా..  వీటిలో జన్యుపరమైన మార్పులు జరిగే అవకాశం కూడా ఉంది. జంతువులకు సోకే వైరస్‌‌లో చోటుచేసుకున్న జన్యుమార్పుల కారణంగానే కరోనా మానషులకు సోకిన విషయం తెలిసిందే. 

Updated Date - 2022-02-08T01:36:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising