ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారతీయ అసిస్టెంట్‌పై వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ ప్రశంసల వర్షం.. అతను సూపర్ టాలెంటెడ్ అంటూ..

ABN, First Publish Date - 2022-04-08T23:47:26+05:30

అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో ప్రెస్ సెక్రెటరీగా విధులు నిర్వహిస్తున్న జెన్ సాకీ తన భారతీయ అసిస్టెంట్ వేదాంత్ పటేల్‌పై తాజాగా ప్రశంసల వర్షం కురిపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై  డెస్క్: అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో ప్రెస్ సెక్రెటరీగా విధులు నిర్వహిస్తున్న జెన్ సాకీ తన భారతీయ అసిస్టెంట్ వేదాంత్ పటేల్‌పై తాజాగా ప్రశంసల వర్షం కురిపించారు. అతడు చాలా చాలా టాలెంటెడ్ అంటూ పొగడ్తల్లో ముంచెత్తారు.ప్రెస్ సెక్రెటరీ స్థాయి అధికారి ఇలా బహిరంగంగా ఓ వ్యక్తిని పొగడడం అరుదైన విషయం కావడంతో.. వేదాంత్ ప్రస్తుతం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారారు. 


‘‘నీకు చాలా ఈజీ పనులు అప్పగిస్తున్నామంటూ నేను వేదాంత్‌తో జోక్ చేస్తుంటా. కానీ.. అలాంటిదేమీ ఉండదు.  అతను సూపర్ టాలెంటెడ్ కావడంతో పని సులువుగా అయిపోతుంది. వేదాంత్ గురించి ఓ విషయం చెప్పదలుచుకున్నా. అతనో గొప్ప రచయిత. చాలా వేగంగా కూడా రాయగలుగుతారు.  అతనికి రాజకీయాల్లో మంచి భవిష్యత్తు ఉంది. నాకూ, బైడెన్‌కూ రోజువారి కార్యకలాపాల్లో చాలా బాగా సాయపడుతుంటాడు’’ అని ఆమె వ్యాఖ్యానించారు. 


బైడెన్ ప్రభుత్వం తొలినాళ్ల నుంచీ వేదాంత్ అసిస్టెంట్ ప్రెస్ సెక్రెటరీగా చేస్తున్నారు. గుజరాత్‌లో పుట్టిన ఆయన బాల్యం అంతా అమెరికాలోనే గడిచింది. యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో వేదాంత్ గ్రాడ్యూయేషన్ చేశారు. అనంతరం.. యూనివర్శిటీ ఆఫ్ ఫ్లోరిడాలోని వాషింగ్టన్ కాలేజ్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీయే చేశారు. ఆయన వయసు కేవలం ముప్ఫై రెండే అయినా కూడా వైట్‌హౌస్‌కు నిత్యం వచ్చే పాత్రికేయులకు సుపరిచితులే. అంతేకాకుండా.. బైడెన్ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలోనూ సీనియర్ స్పోక్స్‌పర్సన్‌గా సేవలందించారు. 

Updated Date - 2022-04-08T23:47:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising