ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Green Card: అమెరికా గ్రీన్ కార్డు కోసం ట్రై చేస్తున్నారా.. అయితే మీకో గుడ్ న్యూస్..

ABN, First Publish Date - 2022-09-25T01:39:14+05:30

అమెరికాలో ఏళ్ల తరబడి గ్రీన్ కార్డు(Green Card) కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు ఓ గుడ్ న్యూస్. గ్రీన్ కార్డుల జారీ ప్రక్రియను ఆరు నెలల్లోగా పూర్తిచేయాలన్న ప్రతిపాదనను బైడెన్ ప్రభుత్వం పరిశీలిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: అమెరికాలో ఏళ్ల తరబడి గ్రీన్ కార్డు(Green Card) కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు ఓ గుడ్ న్యూస్. గ్రీన్ కార్డుల జారీ ప్రక్రియను ఆరు నెలల్లోగా పూర్తిచేయాలన్న ప్రతిపాదనను బైడెన్ ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీంతో పాటూ 2023 నాటికల్లా గ్రీన్ కార్డుల బ్యాక్‌లాగ్ లేవీ లేకుండా చేయాలన్న ప్రతిపాదన కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే భారత్, చైనాల నుంచి అమెరికాకు వెళ్లిన అనేక మందికి ప్రయోజనం చేకూరనుంది. అమెరికాలో వారి భవిష్యత్తుకు భద్రత లభిస్తుంది. 


వలస విధానాల వ్యవహారాలను పర్యవేక్షించే ప్రెసిడెంన్షియల్ అడ్వైసరీ కమిషన్(Presidential advisory commission) ఈ ఏడాది మేలో గ్రీన్ కార్డుకు సంబంధించి పలు ప్రతిపాదనలు రూపొందించింది. ఇందుకు సంబంధించిన నివేదికను శుక్రవారం విడుదల చేసింది. శ్వేతసౌధంలోని(White House) డొమెస్టిక్ పాలసీ కౌన్సిల్‌(Domestic Policy council) పరిశీలనకు పంపింది. వీటిని సమీక్షించిన అనంతరం కౌన్సిల్ ఈ నివేదికను అధ్యక్షుడి ముందుంచుతుంది. ఈ ప్రతిపాదనలను జో బైడెన్(Joe biden) ఆమోదిస్తే.. భారతీయులకు ఎనలేని ప్రయోజనం చేకూరుతుందని చెబుతున్నారు. 


ఇక.. పర్యాటకంపై 2017 నాటి ఆంక్షల ప్రభావం ఇప్పటికీ ఉంటోందని కమిషన్ తన నివేదికలో పేర్కొంది. దీనికి తోడు కరోనా సంక్షోభం సంబంధిత ఆంక్షలు, సిబ్బంది కొరత తదితర కారణాల కారణంగా గ్రీన్ కార్డుల జారీలో తీవ్ర జాప్యం నెలకొందని పేర్కొంది. 2021లో మొత్తం 226000 గ్రీన్ కార్డులు అందుబాటులోకి రాగా.. కేవలం 65 వేల పైచిలుకు కుటుంబ ఆధారిత గ్రీన్ కార్డులు మాత్రమే జారీ అయ్యాయని నివేదికలో పేర్కొంది. గ్రీన్ కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు.. అమెరికా విదేశాంగ శాఖకు చెందిన నేషనల్ వీసా సెంటర్.. అదనపు సిబ్బందిని నియమించుకోవాలని కూడా సూచించింది. 2022 ఆగస్టు మొదలు మూడు నెలల్లోగా ప్రస్తుత సంఖ్యతో పోలిస్తే రెండింతల గ్రీన్ కార్డుల ఇంటర్వ్యూలు పూర్తి చేయాలని కూడా సూచించింది. అంతేకాకుండా.. ప్రస్తుతమున్న సంఖ్యతో పోలిస్తే.. 2023 నాటికల్లా ఒకటిన్నర రెట్ల దరఖాస్తులను పరిశీలించి, గ్రీన్ కార్డు జారీ అయ్యిందీ, లేనిదీ ప్రకటించాలని కమిషన్ తన నివేదికలో సూచించింది. ఆపై.. ఆరు నెలల్లోగానే వీసా ఇంటర్వ్యూల నిర్వహణ, దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలని చెప్పింది.

Updated Date - 2022-09-25T01:39:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising