ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విమాన సిబ్బందిపై రెచ్చిపోయిన ప్యాసింజర్.. వీడియో వైరల్

ABN, First Publish Date - 2022-09-23T04:06:30+05:30

విమాన సిబ్బందిపై దాడి చేసిన ఓ ప్యాసెంజర్ అమెరికా పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: విమాన సిబ్బందిపై దాడి చేసిన ఓ ప్యాసెంజర్‌ను అమెరికా పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. బుధవారం నాడు శాన్ హోసే నుంచి లాస్‌ఏంజిలిస్ వెళుతున్న అమెరికన్ ఎయిర్‌లైన్స్(American Airlines) సంస్థ విమానంలో ఈ ఘటన జరిగింది. విమాన ప్రయాణికుల్లో ఒకరు ఘటన మొత్తాన్ని మొబైల్ ఫోన్‌లో రికార్డు చేసి నెట్టింట్లో పెట్టారు. విమానం లాస్ ఏంజిలిస్ ఎయిర్‌పోర్టులో దిగగానే పోలీసులు దాడికి పాల్పడ్డ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 


విమానంలోని ఇతర ప్రయాణికుల కథనం ప్రకారం.. దాడికి పాల్పడటానికి ముందు నిందితుడు..ఇక్కడ హంతుకులు ఉన్నారంటూ గొణగడం ప్రారంభించాడు. విమాన సిబ్బందిలో ఒకరు అతడి సీటు వద్దకు వెళ్లి నచ్చచెప్పే ప్రయత్నం చేసింది. ఈలోపు మరో సిబ్బంది వచ్చి అతడిని శాంతిపజేసే ప్రయత్నం చేశారు. కానీ..ప్యాసింజర్ మాత్రం నోరుపారేసుకున్నాడు. ఏంటి  నన్ను బెదిరిస్తున్నావా అంటూ ఆ ప్యాసింజర్‌ను సిబ్బంది ప్రశ్నించారు. ఆ తరువాత ఆ ఫ్లైట్ ఎటెండెంట్ వెనక్కు తిరిగి వెళుతుండగా..ప్యాసెంజర్ దాడికి పాల్పడ్డాడు. పిడికిలి బిగించి తలపై కొట్టాడు. ఈలోపు ఇతర ప్రయాణికులు కల్పించుకుని అతడిని అదుపు చేశారు. విమానం లాస్ ఏంజిలిస్‌లో దిగాక అతడిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా.. ఈ ఘనటపై అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. అతడిని ఇక మరెన్నడూ తమ విమానాల్లోకి అనుమతించమని పేర్కొంది. అమెరిక పౌరవిమానయాన శాఖ నిబంధన ప్రకారం.. ఈ కేసులో నిందితుడు నేరం చేసినట్టు తేలితే ఏకంగా 20 ఏళ్ల కారాగార శిక్ష పడే అవకాశం ఉంది. 

Updated Date - 2022-09-23T04:06:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising