ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NATS: చికాగోలో 'నాట్స్' ఆధ్వర్యంలో తెలుగువారి విహారయాత్ర..!

ABN, First Publish Date - 2022-08-31T18:41:47+05:30

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) తాజాగా భారతీయ అజాదీ అమృతోత్సవ్‌లో భాగంగా చికాగోలో తెలుగువారితో విహారయాత్ర ఏర్పాటు చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చికాగో: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) తాజాగా భారతీయ అజాదీ అమృతోత్సవ్‌లో భాగంగా చికాగోలో తెలుగువారితో విహారయాత్ర ఏర్పాటు చేసింది. 200 మందికి పైగా తెలుగు కుటుంబాలు ఈ విహారయాత్రలో పాలుపంచుకున్నాయి. పార్క్‌లో పిల్లలు, పెద్దలు ఎంతో ఉత్సాహాంగా ఆట, పాటలతో  అమృతోత్సవ సంబరాలు చేసుకున్నారు. ఈ విహారయాత్రలో ప్రముఖ మిమిక్రీ కళాకారుడు ఇమిటేషన్ రాజు నవ్వులు పూయించారు. డీజే సందీప్ సినిమా పాటల ప్రదర్శన అందరిలోనూ ఉత్సాహం నింపింది. కొత్తగా ఏర్పాటైన చాప్టర్ కోఆర్డినేటర్ హరీశ్ జమ్ముల ఈ విహారయాత్ర నిర్వహణ బాధ్యతలను భుజానికెత్తుకున్నారు. హరీశ్ తన టీం సభ్యులైన బిందు వీధులమూడి, వీర తక్కెళ్లపాటి, భారతి పుట్ట, రోజా శీలంశెట్టి, నరేంద్ర కడియాల, కార్తీక్ మోదుకూరి రాజయ్య వినయ్‌తో కలిసి చక్కటి ప్రణాళికతో ఈ విహారయాత్రను విజయవంతం చేశారు.


చికాగో నుంచి నాట్స్ ఈసీ నాయకులు మదన్ పాములపాటి, కృష్ణ నిమ్మగడ్డ, ఆర్.కె బాలినేని, లక్ష్మి బొజ్జా ఈ విహారయాత్ర దిగ్విజయం కావడానికి తమ పూర్తి సహకారాన్ని అందించారు. చికాగో నుంచి మద్దతు అందించిన మూర్తి కొప్పాక, శ్రీను అరసాడ, శ్రీనివాస్ బొప్పన, రవి శ్రీకాకుళం తదితరులకు నాట్స్ బోర్డ్ ధన్యవాదాలు తెలిపింది. ఇంకా నాట్స్ చికాగో చాప్టర్ వాలంటీర్లు వేణు కృష్ణార్దుల, శ్రీనివాస్ పిడికిటి, మహేష్ కాకరాల, లేఖ నిమ్మగడ్డ, పాండు చెంగలశెట్టి, అంజయ్య వేలూరు, గోపాల్ రెడ్డి, శ్రీకాంత్ బొజ్జా, శిల్పా యర్రా, రాధిక కోగంటి, సుమతి నెప్పలి, నరేశ్ యాడ, సాంబశివరావు, అరుష్ నిమ్మగడ్డ, వర్షిత్ తక్కెళ్లపాటి, సంకేత్, రాజేశ్ వీధులమూడి తదితరులు ఈ విహార యాత్ర కోసం విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. బౌల్ ఓ బిర్యానీ మరియు బావార్చి వారు ఈ విహారయాత్రలో పాల్గొన్న అందరికీ చక్కటి విందు ఏర్పాటు చేశారు. 















Updated Date - 2022-08-31T18:41:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising