ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Saudi Arabia‌లో దారుణం.. చిన్న కారణంతో భారతీయుడిని హత్య చేసిన పాకిస్థానీ..

ABN, First Publish Date - 2022-07-11T17:09:08+05:30

ఉపాధి కోసం అతడు భార్యబిడ్డలను సొంత గ్రామంలో వదిలి.. ఏడాది దేశం పట్టాడు. ఏళ్లపాటు అక్కడే పని చేసిన అతడు.. కుటుంబ సభ్యులను చూసేందుకు తిరిగి ఇంటికి వద్దామని భావించాడు. అయితే.. ఇంతలోనే దారుణం చోటు చే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: ఉపాధి కోసం అతడు భార్యబిడ్డలను సొంత గ్రామంలో వదిలి.. ఏడాది దేశం పట్టాడు. ఏళ్లపాటు అక్కడే పని చేసిన అతడు.. కుటుంబ సభ్యులను చూసేందుకు తిరిగి ఇంటికి వద్దామని భావించాడు. అయితే.. ఇంతలోనే దారుణం చోటు చేసుకుంది. పాకిస్థానీ చేతిలో హత్యకు గురయ్యాడు. విషయం తెలిసి అతడి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



ఉత్తరప్రదేశ్‌‌లోని అమేతి జిల్లాకు చెందిన జాంగ్ బహదూర్.. ఉపాధి కోసం 2017లో సౌదీ అరేబియా వెళ్లాడు. అక్కడ కారు డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తూ.. జీతంగా వచ్చే డబ్బును కుటుంబ సభ్యులకు పంపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో జూలై 6న తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసిన ఆయన.. స్వగ్రామానికి రావాలనుకుంటున్నట్టు తెలిపాడు. అందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు వివరించాడు. ఇంతలోనే దారుణం చోటు చేసుకుంది. తనతోపాటు పని చేస్తున్న పాకిస్థాన్ పౌరుడి చేతిలో హత్యకు గురయ్యాడు. పని విషయంలో జరిగిన ఘర్షణలో ఆగ్రహానికి గురైన పాకిస్థానీ.. 43ఏళ్ల జాంగ్ బహదూర్ హత్య చేశాడు. కాగా.. అతడి మరణ వార్తని విని కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అంతేకాకుండా తమకు జరిగిన అన్యాయాన్ని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దృష్టికి తీసుకెళ్లారు. జాంగ్ బహదూర్ మృతదేహాన్ని స్వదేశానికి తరలించడంతోపాటు.. ఈ ఘటనలో తమకు న్యాయం జరిగేలా చూడాలని అభ్యర్థించారు. 


Updated Date - 2022-07-11T17:09:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising