ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Green Cards: గ్రీన్ కార్డులపై అమెరికా కీలక ప్రకటన.. సెప్టెంబర్ 30 కల్లా..

ABN, First Publish Date - 2022-09-12T03:08:21+05:30

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అందుబాటులోకి వచ్చిన గ్రీన్ కార్డుల కోటా మొత్తాన్ని వినియోగించుకున్నట్టు అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ శాఖ తాజాగా పేర్కొంది. సెప్టెంబర్ 30 నాటికి 2,81,507 ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డులు జారీ అవుతాయని తెలిపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అందుబాటులోకి వచ్చిన గ్రీన్ కార్డుల(Green Card) కోటా మొత్తాన్ని వినియోగించుకున్నట్టు అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ శాఖ(USCIS) తాజాగా పేర్కొంది. సెప్టెంబర్ 30 నాటికి 2,81,507 ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డులు జారీ అవుతాయని తెలిపింది. ఈ పరిణామంపై అమెరికాలోని వలస సేవల లాయర్లు హర్షం వ్యక్తం చేశారు. ఈ స్థాయిలో గ్రీన్ కార్డుల జారీకి సిద్ధమవడం సామాన్య విషయం కాదని ఓ న్యాయవాది వ్యాఖ్యానించారు. సిబ్బంది, ఉన్నతాధికారులు విపరీతంగా శ్రమిస్తేనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. ‘‘ఏటా జారీ చేసే గ్రీన్ కార్డుల కంటే ఈమారు రెట్టింపు సంఖ్యలో గ్రీన్ కార్డులు జారీ అయ్యాయి. ఈ క్రమంలో ప్రభుత్వ ఏజెన్సీలు ఎన్నో అడ్డంకులను అధిగమించాయి’’ అని తెలిపారు. 


2021 నాటి కోటాలో ఏకంగా 65 వేల గ్రీన్ కార్డులు ఎవరికీ జారీ కాకుండా నిరుపయోగమైపోయాయి. అయితే.. ఈ మారు ఓ క్రమపద్ధతిలో గ్రీన్ కార్డుల జారీ జరగడం లేదని కొందరు వలస సేవల లాయర్లు అభిప్రాయపడ్డారు. ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికి ఎటువంటి ప్రయోజం లేకుండా పోయిందని వాపోతున్నారు. ‘‘క్రమానుగతంగా దరఖాస్తులను పరిశీలించే బదులు..తేలికగా పరిష్కారమయ్యే దరఖాస్తులను ముందుగా పరిశీలిస్తున్నారు. ఇది ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధం’’ అని మరో లాయర్ వ్యాఖ్యానించారు. 

Updated Date - 2022-09-12T03:08:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising