ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

H-1B వీసాల విషయంలో USCIS కీలక ప్రకటన

ABN, First Publish Date - 2022-01-29T22:11:16+05:30

హెచ్-1బీ వీసాలకు సంబంధించిన అమెరికా కీలక ప్రకటన విడుదల చేసింది. అక్టోబర్ 2022 నుంచి నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో కొత్త హెచ్-1బీ వీసాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: హెచ్-1బీ వీసాలకు సంబంధించిన అమెరికా కీలక ప్రకటన విడుదల చేసింది. అక్టోబర్ 2022 నుంచి నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో కొత్త హెచ్-1బీ వీసాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు వెల్లడించింది. అభ్యర్థులు మార్చి 1,2022 నుంచి రిజిస్టర్ చేసుకోవాలని యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్విసెస్ (యూఎస్‌సీఐఎస్) శుక్రవారం తెలిపింది. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 18న ముగియనున్నట్టు స్పష్టం చేసింది. ప్రతి దరఖాస్తుదారుడు రిజిస్ట్రేషన్ ఫీజు కింద 10 డాలర్లు (సుమారు రూ.750) చెల్లించాల్సి ఉంటుందని చెప్పింది. హెచ్-1బీ వీసాకు ఎంపికైన అభ్యర్థులకు మార్చి 31లోపు సమాచారం చేరవేయనున్నట్టు పేర్కొంది. 



ఇక ప్రతి యేటా యూఎస్ వీదేశీయులకు 65 వేల హెచ్-1బీ వీసాలు జారీ చేస్తోంది. అలాగే మరో 20వేల హెచ్-బీ వీసాలు మాస్టర్ క్యాప్(అత్యున్నత విద్యార్హతలు, నైపుణ్యం) కింద ఇస్తోంది. ఇలా ప్రతి ఏడాది అగ్రరాజ్యం విదేశీయులకు ఉపాధి కల్పించేందుకు మొత్తం 85వేల హెచ్-1బీ వీసాలు జారీ చేస్తోంది. అయితే, ప్రతి ఏడాది యూఎస్ ఇచ్చే 85వేల కొత్త హెచ్-1బీ వీసాలలో సుమారు 70 శాతం వీసాలు(దాదాపు 60వేలు) భారతీయులకు జారీ అవుతున్నట్లు సమాచారం. 




Updated Date - 2022-01-29T22:11:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising