ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెస్టారెంట్‌కు వస్తానని మాటిచ్చి మోసం చేసిన యువకుడిపై యువతి కేసు.. చివరకు ఏం జరిగిందంటే..

ABN, First Publish Date - 2022-07-24T03:14:01+05:30

తనతో రెస్టారెంట్‌కు వస్తానన్న(Date) యువకుడు రాకుండా మోసం చేశాడంటూ అమెరికాకు కషాంటే షార్ట్ అనే యువతి కోర్టుకెక్కింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: తనతో రెస్టారెంట్‌కు వస్తానన్న(Date) యువకుడు రాకుండా మోసం చేశాడంటూ అమెరికాకు కషాంటే షార్ట్ అనే యువతి కోర్టుకెక్కింది. రిచర్డ్ జార్డన్ చేసిన మోసం కారణంగా తనకు మనోవేదన కలిగిందని చెప్పుకొచ్చింది. ఇందుకు పరిహారంగా రిచర్డ్ తనకు 10 వేల డాలర్లు చెల్లించేలా ఆదేశాలివ్వాలంటూ న్యాయస్థానాన్ని వేడుకుంది.  ఇటీవల జూమ్‌కాల్‌లో జరిగిన విచారణలో న్యాయస్థానం ఇరు వర్గాల వాదనలు విన్న తరువాత... కేసును దిగువ కోర్టుకు బదిలీ చేస్తూ తీర్పు వెలువరించింది. అంతేకాకుండా.. తప్పుడు కోర్టులో కేసు వేసి యువకుడిపై న్యాయఖర్చల భారం పడేలా చేసినందుకు అతడిని పరిహారం చెల్లించాలని యువతిని న్యాయస్థానం ఆదేశించింది. 


ఇక విచారణ సందర్భంగా షార్ట్ న్యామూర్తితో కూడా గొడవ పడింది. రిచర్డ్ పర్జరీకి పాల్పడినట్టుగా కూడా అభియోగం దాఖలు చేయాలని పట్టుబట్టింది. ఈ క్రమంలో పర్జరీకి నిర్వచనం ఏంటో.. ఈ కేసులో ఆ అభియోగం దాఖలు చేయడం సబబో కాదో అనే అంశంలో న్యాయమూర్తితో ఆమె వాగ్వాదానికి దిగింది. 10 నిమిషాల పాటు సాగిన ఈ విచారణ చివరికి కేసును దిగువ కోర్టుకు బదిలీ చేయడంతో ముగిసింది. 

Updated Date - 2022-07-24T03:14:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising