ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మార్గం మధ్యలో ప్రయాణికురాలికి ‘పాజిటివ్‌’.. విమానం మరుగుదొడ్డిలో 5 గంటల క్వారంటైన్‌

ABN, First Publish Date - 2022-01-01T12:41:05+05:30

కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయిన వారిని ప్రత్యేక గదుల్లో క్వారంటైన్‌ చేస్తారు. కానీ ఆ మహిళను విమానం టాయిలెట్‌లో ఐదు గంటలపాటు క్వారంటైన్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీట్లన్నీ నిండి ఉండటంతో దిగేదాకా టాయిలెట్‌లోనే

న్యూయార్క్‌, డిసెంబరు 31: కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయిన వారిని ప్రత్యేక గదుల్లో క్వారంటైన్‌ చేస్తారు. కానీ ఆ మహిళను విమానం టాయిలెట్‌లో ఐదు గంటలపాటు క్వారంటైన్‌ చేశారు. ఎందుకలా జరిగింది ? అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ వార్తను పూర్తిగా చదవాల్సిందే. అమెరికాలోని మిషిగాన్‌ రాష్ట్రానికి చెందిన ఉపాధ్యాయురాలు మారిసా ఫోటియో షికాగో నుంచి ఐస్‌లాండ్‌కు వెళ్లే విమానం ఎక్కింది. అంతకుముందు ఆమె 2 పీసీఆర్‌ పరీక్షలు, 5 ర్యాపిడ్‌ టెస్టులు చేయించుకున్నా ‘నెగెటివ్‌’ వచ్చింది. కానీ విమానం ఎక్కినప్పటి నుంచి గొంతు తడారిపోతుండటంతో సందేహం వచ్చి.. బాత్‌రూమ్‌లోకి వెళ్లి స్వయంగా ర్యాపిడ్‌ కొవిడ్‌ టెస్టు చేసుకుంది. అయితే అందులో పాజిటివ్‌ వచ్చింది.


అక్కడే నిలబడి.. మహిళా సహాయక సిబ్బంది ఒకరిని పిలిచి ఈవిషయాన్ని చెప్పింది. చివర్లో ఉండే సీట్లలో మారిసాను కూర్చోబెట్టాలని సహాయక సిబ్బంది ప్రయత్నించినప్పటికీ.. విమానంలోని సీట్లన్నీ నిండి ఉండటంతో అది సాధ్యపడలేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఐస్‌లాండ్‌లో విమానం ల్యాండ్‌ అయ్యే దాకా ఐదు గంటల పాటు బాత్‌రూమ్‌లోనే మారిసా కూర్చున్నారు. సహాయక సిబ్బందికి ఆమె కోసం భోజనాలు, కూల్‌ డ్రింక్స్‌ను అక్కడికే తీసుకెళ్లి ఇచ్చారు. 


Updated Date - 2022-01-01T12:41:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising