ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భర్తతో కలిసి భారీ స్కెచ్ వేసిన మహిళ.. కథ అడ్డం తిరగడంతో చివరికి ఆమె పరిస్థితి..

ABN, First Publish Date - 2022-06-29T20:10:33+05:30

అగ్రరాజ్యం అమెరికాలో ఓ మహిళ తన భర్తతో కలిసి భారీ స్కెచ్ వేసింది. పెట్టుబడుల పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేసి.. ఆ డబ్బును విలాసవంతమైన జీవితం గడిపేందుకు ఉపయోగించింది. అయితే కథ అడ్డం తిరగడంతో కోర్టు ఆమెకు 11ఏళ్ల జైలు శిక్ష వి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: అగ్రరాజ్యం అమెరికాలో ఓ మహిళ తన భర్తతో కలిసి భారీ స్కెచ్ వేసింది. పెట్టుబడుల పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేసి.. ఆ డబ్బును విలాసవంతమైన జీవితం గడిపేందుకు ఉపయోగించింది. అయితే కథ అడ్డం తిరగడంతో కోర్టు ఆమెకు 11ఏళ్ల జైలు శిక్ష విధించింది. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


అమెరికాకు చెందిన పాలెట్ కార్పోఫ్ (51) తన భర్త జెఫ్‌తో కలిసి సోలార్ జనరేటర్ల పేరుతో చైన్ విధానంలో పెట్టుబడులను ఆకర్షించింది. పెట్టుబడి పెట్టిన వారికి సోలార్ జనరేటర్లను అందించనున్నట్టు మాయమాటలు చెప్పింది. ఈ క్రమంలో కొందరు ఆ దంపతుల మాటలు నమ్మారు. దీంతో దాదాపు 17 మంది 910 మిలియన్ డాలర్ల డబ్బును ఆ దంపతుల చేతిలో పెట్టారు. అనంతరం తమ పెట్టుబడికి తగ్గ సోలార్ జనరేటర్లు.. పాలెట్ దంపతుల నుంచి అందకపోవడంతో వారంతా షాకయ్యారు. ఈ క్రమంలో పోలీసులను ఆశ్రయించడంతో బండారం బయటపడింది. పెట్టుబడి పేరుతో సమకూర్చిన డబ్బుతో పాలెట్ దంపతులు లగ్జరీ కార్లు, ఆభరణాలు కొనుగోలు చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. దీంతో అధికారులు ఆ దంపతులను కోర్టు హాజరుపర్చారు. 2011-2018 మధ్య ఈ స్కామ్ చోటు చేసుకోగా.. 2020లో ఈ దంపతులు తమ నేరాన్ని అంగీకరించారు. ఈ క్రమంలో భర్త జెఫ్‌కు 30ఏళ్లపాటు జైలు శిక్ష విధించిన కాలిఫోర్నియా కోర్టు.. జాతాగా పాలెట్ కార్పోఫ్‌కు 11ఏళ్లపాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది.  




Updated Date - 2022-06-29T20:10:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising