ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tourist visa: అమెరికా వెళ్లేవారికి గుడ్‌న్యూస్

ABN, First Publish Date - 2022-08-04T18:50:39+05:30

అగ్రరాజ్యం అమెరికా (America) వెళ్లేవారి ఇది నిజంగా గుడ్‌న్యూస్ (Good News) అనే చెప్పాలి. గతకొంతకాలంగా నిలిపివేసిన టూరిస్ట్ వీసాల అపాయింట్‌మెంట్స్‌ (Tourist visa appointments)ను తిరిగి ప్రారంభిస్తున్నట్లు తాజాగా అమెరికా ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: అగ్రరాజ్యం అమెరికా (America) వెళ్లేవారి ఇది నిజంగా గుడ్‌న్యూస్ (Good News) అనే చెప్పాలి. గతకొంతకాలంగా నిలిపివేసిన టూరిస్ట్ వీసాల అపాయింట్‌మెంట్స్‌ (Tourist visa appointments)ను తిరిగి ప్రారంభిస్తున్నట్లు తాజాగా అమెరికా ప్రకటించింది. ఈ మేరకు భారత్‌లోని యూఎస్ ఎంబసీ (US Embassy) కీలక ప్రకటన చేసింది. "2022 సెప్టెంబరులో రొటీన్ ఇన్ పర్సన్ టూరిస్ట్ వీసా అపాయింట్‌మెంట్‌లను పునఃప్రారంభిస్తున్నాము. గతంలో షెడ్యూల్ చేసిన ప్లేస్‌హోల్డర్లు ఇప్పుడు రద్దు చేయబడ్డాయి. ప్లేస్‌హోల్డర్ అపాయింట్‌మెంట్‌లు రద్దు చేయబడిన దరఖాస్తుదారులు ఇప్పుడు సాధారణ అపాయింట్‌మెంట్‌లను బుక్ చేసుకోవడానికి షెడ్యూలింగ్ సిస్టమ్‌లోకి మళ్లీ లాగిన్ అవ్వొచ్చు" అని రాయబార కార్యాలయం తన ప్రకటనలో పేర్కొంది. ఇక ఈ ప్రకటనతో యూఎస్‌లో ఉంటున్న తమవారిని కలిసేందుకు చాలారోజులుగా ఎదురుచూస్తున్న వేలాదిమందికి ఉపశమనం లభించింది. ఇదిలాఉంటే.. ఇప్పటివరకు టూరిస్ట్ వీసాలు (Tourist visas) పరిమిత సంఖ్యలోనే జారీ అవుతున్నాయి. మహమ్మారి విజృంభణ నేపథ్యంలో వీసాల జారీని భారత్‌లోని యూఎస్ ఎంబసీలతో పాటు అన్ని కాన్సులేట్‌ కార్యాలయాలు పరిమితం చేశాయి. ఇక గడువు ముగిసిన వీసాల రెన్యూవల్‌కు డ్రాప్‌ బాక్స్‌ విధానంలో అనుమతిస్తున్నారు. 

Updated Date - 2022-08-04T18:50:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising