ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికా సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం..! ఆ చట్టాన్ని కొట్టివేస్తూ తీర్పు..

ABN, First Publish Date - 2022-06-24T03:21:30+05:30

తుపాకీ సంస్కృతి ప్రతికూల ప్రభావాలతో అమెరికా ప్రస్తుతం తల్లడిల్లుతోంది. విచ్చలివిడి గన్స్ వినియోగానికి అడ్డుకట్ట వేయాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో అమెరికా సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: తుపాకీ సంస్కృతి ప్రతికూల ప్రభావాలతో అమెరికా ప్రస్తుతం తల్లడిల్లుతోంది. విచ్చలివిడి గన్స్ వినియోగానికి అడ్డుకట్ట వేయాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో అమెరికా సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తుపాకీ వినియోగంపై ఆంక్షలు విధించే న్యూయార్క్ రాష్ట్ర చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధమంటూ గురువారం కొట్టేసింది. దశాబ్దాల నాటి ఆ చట్టం ప్రకారం.. స్వీయరక్షణ కోసం ఎవరికీ కనబడకుండా తుపాకీని తమ వెంట తీసుకెళ్లాలనుకునే వారు తగిన కారణం చూపించాలి. ఈ విషయంలో ఎవరికి లైసెన్స్ ఇవ్వాలో నిర్ణయించేది స్థానిక అధికారులే. అయితే.. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమంటూ న్యాయస్థానం తాజాగా కొట్టేసింది. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణకు ఇది వ్యతిరేకమని పేర్కొంది. ఈ సవరణ ప్రకారం.. అమెరికా పౌరుల ప్రత్యేక హక్కులు రద్దయ్యేలా ఏ రాష్ట్రమూ చట్టాలు చేయకూడదు. ప్రస్తుతం ఈ తీర్పు అమెరికాలో చర్చనీయాంశమవుతోంది. 

Updated Date - 2022-06-24T03:21:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising