ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికా తుమ్మింది.. ఈసారి మాత్రం అలా జరగదు: ఉదయ్ కోటక్ ఆసక్తికర ట్వీట్

ABN, First Publish Date - 2022-02-11T23:26:30+05:30

అమెరికాలో ద్రవ్యోల్బణం నలభై ఏళ్ల గరిష్ఠానికి చేరిన క్రమంలో అనేక దేశాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. ఈ ప్రభావం భారత్‌పై కూడా పడొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ బ్యాంకర్ ఉదయ్ కోటక్ కీలక వ్యాఖ్యలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: అగ్రరాజ్యం అమెరికా అంటే.. ఆర్థికంగా ప్రపంచంలోనే అతిపెద్ద దేశం. అందుకే.. అమెరికాలో తలెత్తే ఆర్థిక పరిణామాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేకెత్తించగల శక్తి ఉంది. ఈ కారణంగానే ఆర్థిక నిపుణులు.. ‘‘అమెరికా తుమ్మితే ప్రపంచానికి పడిశం పడుతుందని చమత్కరిస్తారు. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే.. అమెరికాలో ద్రవ్యోల్బణం నలభై ఏళ్ల గరిష్ఠానికి చేరిన క్రమంలో అనేక దేశాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. ఈ ప్రభావం భారత్‌పై కూడా పడొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ బ్యాంకర్ ఉదయ్ కోటక్ కీలక వ్యాఖ్యలు చేశారు. 


‘‘ద్రవ్యోల్బణం 7.5%, వడ్డీరేటు 0%! వీటిని చూస్తే.. ఇదేదో అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థ అని, పరిపాలన సరిగ్గా లేదని మీరు అనుకోవచ్చు. కానీ ఇది అమెరికా! 2013లో అమెరికా నిర్ణయాల కారణంగా భారత్ ఇబ్బంది పడాల్సి వచ్చింది.. అమెరికా తుమ్మితే ప్రపంచానికి పడిశం!మిస్టర్ యూఏస్ఏ.. ఈసారి మాత్రం అలా జరగదు’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఈ మారు అమెరికా పరిణామాల ప్రభావం భారత్‌పై పడదనే భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.



Updated Date - 2022-02-11T23:26:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising