ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

America: యూఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ జడ్జిగా రూపాలీ దేశాయ్.. చరిత్ర సృష్టించిన భారత సంతతి మహిళ!

ABN, First Publish Date - 2022-08-07T14:19:53+05:30

అగ్రరాజ్యం అమెరికాలో మరో భారత సంతతి మహిళ (Indian Origin woman)కు పవర్‌ఫుల్ పోస్ట్ దక్కింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాలో మరో భారత సంతతి మహిళ (Indian Origin woman)కు పవర్‌ఫుల్ పోస్ట్ దక్కింది. దీంతో ఈ పదవి చేపట్టబోతున్న ఇండియన్ అమెరికన్ (Indian American) న్యాయవాదిగా రూపాలీ హెచ్‌.దేశాయ్‌ (Roopali H. Desai) చరిత్ర సృష్టించారు. యూఎస్‌ (US)లో అత్యంత శక్తిమంతమైన తొమ్మిదో సర్క్యూట్‌ అపీల్స్‌ కోర్ట్‌ జడ్జిగా ఆమె నియామకాన్ని తాజాగా యూఎస్ సెనేట్‌ ఆమోదించింది. దాంతో దక్షిణాసియా నుంచి ఈ ఘనత సాధించిన తొలి జడ్జిగా రూపాలీ దేశాయ్ చరిత్రకెక్కారు. 44 ఏళ్ల రూపాలీ నియామకాన్ని సెనేట్ (Senate) 67- 29 ఓట్ల తేడాతో గురువారం ఆమోదించింది.


ఇక తొమ్మిదో సర్క్యూట్‌కు రూపాలీ దేశాయ్ (Roopali Desai) అత్యుత్తమ ఎంపిక అని సెనేట్ జ్యుడీషియరీ కమిటీ చైర్‌పర్సన్‌ డిక్ డర్బిన్ అన్నారు. అత్యంత ప్రతిభావంతురాలైన ఆమె నామినేషన్‌కు భారీ మద్దతు లభించడం తనకు ఏమాత్రం ఆశ్చర్యం కలిగించలేదని డర్బిన్‌ ప్రశంసించారు. శాన్‌ఫ్రాన్సిస్కో (San Francisco) కేంద్రంగా పనిచేసే తొమ్మిదో సర్క్యూట్‌ అమెరికాలోని 13 పవర్‌ఫుల్‌ అపీల్‌ కోర్టుల్లో అతి పెద్దది. 9 రాష్ట్రాలు, 2 ఫెడరల్ ఏరియాలు, 20 క్రియాశీల న్యాయస్థానాలు దీని పరిధిలోకి వస్తాయి.


రూపాలీ దేశాయ్ (Roopali Desai) 1978లో కెనడాలో జన్మించారు. అరిజోనా వర్సిటీ నుంచి న్యాయ శాస్త్రంలో మాస్టర్స్‌ పట్టా పొందారు. 2007 నుంచి కాపర్‌స్మిత్‌ బ్రోకెల్‌మన్‌ లా సంస్థలో పార్టనర్‌గా ఉన్నారు. 2021లో కీలకమైన అమెరికన్‌ లా ఇన్‌స్టిట్యూట్‌లో సభ్యులుగా చేరారు. గత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అరిజోనా (Arizona) రాష్ట్రంలో జో బైడెన్‌ గెలుపును సవాలు చేస్తూ డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) వేసిన కేసులో ట్రంప్‌కు వ్యతిరేకంగా సమర్థంగా వాదనలు వినిపించారు. అమెరికాలో న్యాయ నిపుణురాలిగా ఆమెకు సుదీర్ఘమైన 16 ఏళ్ల అనుభవం ఉంది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఆమెను ఈ అత్యున్నత పదవికి నామినేట్ చేశారు. 


Updated Date - 2022-08-07T14:19:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising