ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌పై అమెరికా ఆంక్షలు?

ABN, First Publish Date - 2022-03-04T13:07:05+05:30

భారత్‌పై అమెరికా ఆంక్షలు విధించనుందా? రష్యా నుంచి ఎస్‌-400 క్షిపణి వ్యవస్థ కొనుగోలు ఒప్పందమే దీనికి కారణమా? అంటే అమెరికా దౌత్య వర్గాలు అవుననే అంటున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రష్యాతో ‘ఎస్‌-400’ ఒప్పందమే కారణం?

వాషింగ్టన్‌, మార్చి 3: భారత్‌పై అమెరికా ఆంక్షలు విధించనుందా? రష్యా నుంచి ఎస్‌-400 క్షిపణి వ్యవస్థ కొనుగోలు ఒప్పందమే దీనికి కారణమా? అంటే అమెరికా దౌత్య వర్గాలు అవుననే అంటున్నాయి. అమెరికాకు కీలక భాగస్వామి అయిన భారత్‌పై ఆంక్షలు విధించాలా? వద్దా? అనే విషయమైన అధ్యక్షుడు జో బైడెన్‌ నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తూ ఐరాస సర్వప్రతినిధి సభ ప్రవేశపెట్టిన తీర్మానంపై భారత్‌ మూడోసారి ఓటింగ్‌కు దూరంగా ఉంది. దీనిపై అమెరికా స్పందించింది. రష్యా దురాక్రమణపై సమష్టిగా స్పందించాల్సిన అవసరం ఉందని, దాన్ని నొక్కిచెప్పేందుకు విదేశాంగ శాఖ భారత్‌తో సంప్రందింపులు జరుపుతోందని అమెరికా దౌత్యవేత్త డొనాల్డ్‌ లూ వెల్లడించారు. ఈ సంక్షోభంపై భారత్‌ స్పష్టమైన వైఖరి తీసుకోవాలని కోరేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. 


రెండో విడత చర్చలు ప్రారంభం

గురువారం సాయంత్రం రష్యా-ఉక్రెయిన్‌ మధ్య రెండో విడత చర్చలు ప్రారంభమయ్యాయి. కడపటి వార్తలందేసరికి చర్చలు కొనసాగుతున్నాయి. ప్రపంచ బ్యాంకు ప్రాజెక్టుల నిలిపివేత రష్యాపై తాజాగా ప్రపంచబ్యాంకు కూడా చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా రష్యా, దానికి మద్దతునిస్తున్న బెలారస్‌లో తన ప్రోగ్రామ్‌లను తక్షణమే నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. అలాగే తన ప్రాజెక్టులను నిలిపివేసినట్టు చైనాకు చెందిన ఏషియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకు (ఏఐఐబీ) గురువారం పేర్కొంది. 

Updated Date - 2022-03-04T13:07:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising