ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

US Restaurant: ఇడ్లీ, దోశకు కొత్త పేర్లు పెట్టి అమెరికాలో అమ్ముతున్న రెస్టారెంట్.. భారతీయుల గగ్గోలు..

ABN, First Publish Date - 2022-07-18T22:20:25+05:30

అమెరికాలోని ఓ భారతీయ రెస్టారెంట్.. ఇడ్లీ ,దోశ, తదితర భారతీయ వంటకాల పేర్లు మార్చేసింది. విదేశీయులకు పరిచయమున్న కొత్త పేర్లను మెనూలో చేర్చి దోశలు, ఇతర భారతీయ వంటకాలను సర్వ్ చేస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: అమెరికాలోని ఓ భారతీయ రెస్టారెంట్.. ఇడ్లీ ,దోశ, తదితర భారతీయ వంటకాల పేర్లు మార్చేసింది. విదేశీయులకు పరిచయమున్న కొత్త పేర్లతో భారతీయ వంటకాలను సర్వ్ చేస్తోంది. ఆ మెనూ తాలూకు స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. తాము లొట్టలేసుకుంటూ తినే ఆహారానికి పేర్లు మార్చడం భారతీయులకు అస్సలు మింగుడు పడలేదు. నెట్టింట్లో వారు హాహాకారాలు చేస్తున్నారు. ఇదేం చోద్యం.. అంటూ మండిపడుతున్నారు. మా గుండె పగిలిపోయింది అని కొందరు గొల్లు మంటుంటే.. మరి కొందరేమో..అసలు ఇది చట్టబద్ధమైన చర్యేనా అని ప్రశ్నిస్తున్నారు.


అయితే.. రెస్టారెంట్ ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న వారూ ఉన్నారు. విదేశీయులకు ఇవేంటో తెలియదు కాబట్టి.. వారికి తెలిసిన పదాలతో భారతీయ వంటకాలకు కొత్త పేర్లు పెట్టి ఉండొచ్చని కొందరు అభిప్రాయపడ్డారు. ఇంతలా ఆ రెస్టారెంట్‌ను వెనకేసుకొచ్చిన వారు కూడా పేరు మార్పు విషయంలో అంగీకరించలేక తటపటాయిస్తున్నారు. ఇక దేశీయ వంటకాలకు కొత్త పేర్లు పెట్టిన మరో రెస్టారెంట్‌‌లోని మెనూను కూడా ఓ నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడు దీనిపై నెట్టింట్లో రచ్చ జరుగుతోంది. ఇక దోశ, ఇడ్లీల కొత్త పేర్లు ఏంటంటే.. 

సాంబార్ ఇడ్లీ: డంక్డ్‌ రైస్ కేక్ డిలైట్

సాంబార్ వడ: డంక్డ్ డోనట్ డిలైట్ 

ప్లెయిన్ దోశ: నేకెడ్ క్రెప్స్

మసాలా దోశ: స్మాష్డ్ పొటాటో క్రెప్..! రైస్ కేక్, డోనట్, క్రెప్స్ వంటివి విదేశీయులకు తెలిసిన వంటకాల పేర్లు..! 







Updated Date - 2022-07-18T22:20:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising