ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మళ్లీ పొరపాటు పడ్డ అమెరికా అధ్యక్షుడు బైడెన్.. బరాక్ ఒబామా భార్యను..

ABN, First Publish Date - 2022-04-03T21:35:30+05:30

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన తాజా మళ్లీ తడబడి పొరపాటులో కాలేశారు. ఇటీవల ఇచ్చిన ఓ ప్రసంగంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిషెల్ గురించి ప్రస్తావించిన ఆయన.. విషెల్‌ను మాజీ ఉపాధ్యక్షురాలు అని సంబోధించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మళ్లీ పొరపాటులో కాలేశారు. ఇటీవల ఇచ్చిన ఓ ప్రసంగంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిషెల్ గురించి ప్రస్తావించిన ఆయన.. మిషెల్‌ను మాజీ ఉపాధ్యక్షురాలు అని సంబోధించారు. వాస్తవానికి ఆమెను మాజీ ప్రథమమహిళ అని పిలవాల్సి ఉండగా.. బైడెన్ ఇలా తప్పులో కాలేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది. అంతేకాకుండా.. వైస్‌ప్రెసిడెంట్ హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండింగ్‌లోకి వచ్చింది. 


అమెరికా అణుసబ్‌మెరైన్ యూఎస్ఎస్ డెలావేర్‌ను అధికారికంగా విధుల్లోకి ప్రవేశపెడుతున్న సమయంలో ఇచ్చిన స్పీచ్‌లో బైడెన్ ఇలా పొరపడ్డారు. ‘‘మిషెల్ ఒబామా ఉపాధ్యక్షురాలిగా ఉన్న సమయంలో మొదలైన కార్యక్రమాలను.. ప్రస్తుత ప్రథమ మహిళ ముందుగా తీసుకెళుతున్నారు’’ అని ఆయన అనడం.. ఇందుకు సంబంధించి వీడియో నెట్టింట్లో వైరల్ అవడం చకచకా జరిగిపోయాయి. కాగా.. అధ్యక్షుడు బైడెన్ గతంలోనూ ఇలాంటి పొరపాట్లు చేసి.. నవ్వులు పూయించిన విషయం తెలిసిందే. 

Updated Date - 2022-04-03T21:35:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising