ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వృద్ధురాలిగా మేకప్‌, డ్రెస్ వేసుకుని బ్యాంకు దోపిడీ.. చివరకు..

ABN, First Publish Date - 2022-07-22T03:19:14+05:30

అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో తాజాగా ఓ బ్యాంకులో దోపిడీ జరిగింది. వృద్ధురాలిగా కనిపించేలా డ్రెస్ వేసుకుని వచ్చిన నిందితుడు క్లర్క్‌ను బెదిరించి డబ్బుతో ఉడాయించాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో తాజాగా ఓ బ్యాంకులో దోపిడీ జరిగింది. వృద్ధురాలిగా కనిపించేలా డ్రెస్ వేసుకుని వచ్చిన నిందితుడు క్లర్క్‌ను బెదిరించి డబ్బుతో ఉడాయించాడు. సోమవారం హెన్రీ కౌంటీలోని ఛేస్ సిటీ బ్యాంకులో సోమవారం ఈ దోపిడీ జరిగింది.  నిందితుడు నల్ల జాతీయుడిగా పోలీసులు గుర్తించారు. అతడు ఆరు అడుగులు ఉన్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు అతడి చిత్రాలను కూడా రిలీజ్ చేశారు. నిందితుడి వివరాల తెలిసిన వారు తమని సంప్రదించాలని కోరారు. అయితే.. ఘటన గురించి తెలుసుకున్న నెటిజన్లు మాత్రం వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఆరడుగుల ఆకారం.. వింత వేషధారణ చూశాక ఎవ్వరికీ అనుమానం రాకపోవడం ఏంటో అర్థం కావట్లేదని కొందరు వ్యాఖ్యానించారు. మళ్లీ అతడు దోపిడీకి పాల్పడవచ్చని మరికొందరు ఆందోళన వ్యక్తం చేశారు. 


కాగా.. మేనెలలో పారిస్‌ నగరంలో జరిగిన ఓ బ్యాంకు దోపిడీ స్థానికంగా కలకలానికి దారితీసింది. వృద్ధురాలిగా మేకప్‌ వేసుకుని ప్రముఖ లూవ్ర్ మ్యూజియంలోకి ప్రవేశించిన నిందితుడు మోనా లీసా పెయింటింగ్‌పై కేక్ అంటించాడు. అయితే.. ఆ పెయింటింగ్‌ను గాజె పెట్టేలో భద్రపరచడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. అయితే.. పెట్ట అద్దాలను కూడా బద్దలు కొట్టేందుకు నిందితుడు ప్రయత్నించినట్టు సీసీకెమెరాలో రికార్డైంది.  

Updated Date - 2022-07-22T03:19:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising