ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Donald Trumpను చంపేస్తానని బెదిరించిన నిందితుడి అరెస్ట్

ABN, First Publish Date - 2022-01-11T15:45:01+05:30

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను చంపేస్తానని బెదిరిస్తూ ఫోన్ చేసినందుకు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్ : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను చంపేస్తానని బెదిరిస్తూ ఫోన్ చేసినందుకు అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారులు 72 ఏళ్ల నిందితుడిని న్యూయార్క్‌లో సోమవారం అరెస్టు చేశారు. నిందితుడిపై నేర అభియోగపత్రాన్ని సమర్పించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ను కిడ్నాప్ చేసి, చంపేస్తానని థామస్ వెల్నికీ అనే వ్యక్తి బెదిరించాడని బ్రూక్లిన్‌లోని ప్రాసిక్యూటర్లు చెప్పారు.ట్రంప్ 2020 ఎన్నికల్లో ఓడిపోయి పదవీ విరమణ చేయడానికి నిరాకరిస్తే  అతన్ని చంపేస్తానని 2020 జులై నెలలో థామస్ వెల్నికీ అనే వ్యక్తి ఇంటర్వ్యూలో చెప్పాడని  యూఎస్ కాపిటల్ పోలీసులు చెప్పారు.గత ఏడాది జనవరిలో న్యూయార్క్‌లోని లాంగ్ ఐలాండ్‌లోని సీక్రెట్ సర్వీస్ కార్యాలయానికి రెండు వాయిస్ మెయిల్ సందేశాలను పంపినట్లు కూడా మెల్నిక్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఇందులో ట్రంప్‌తో పాటు 12 మంది కాంగ్రెస్ సభ్యులను చంపుతానని వెల్నీకీ బెదిరించాడు.





Updated Date - 2022-01-11T15:45:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising