ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికాలో 9.1 శాతానికి ఎగబాకిన ధరల సూచి.. 41 ఏళ్లలో ఇదే అత్యధికం

ABN, First Publish Date - 2022-07-14T03:30:03+05:30

నానాటికీ పెరుగుతున్న ఇంధన, ఆహార ధరలతో అమెరికాలో ద్రవ్యోల్బణం ఆకాశాన్నంటుతూ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: నానాటికీ పెరుగుతున్న ఇంధన, ఆహార ధరలతో అమెరికాలో ద్రవ్యోల్బణం ఆకాశాన్నంటుతూ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. గత నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ చూడని విధంగా.. జూన్ నెలలో వినియోగదారుల ధరల ధరల సూచి 9.1 శాతానికి చేరింది. దీంతో.. సగటు అమెరికన్‌కు మరింత ఇక్కట్లు తప్పవనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ద్రవ్యోల్బణ నియంత్రణ  కోసం ఫెడరల్ బ్యాంక్ మారోసారి వడ్డీ రేట్లు పెంచుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పెరుగుతున్న ధరల కారణంగా  అమెరికాలో అల్పాదాయ  వర్గాలు, లాటిన్ అమెరికా సంతతి వారు అత్యధికంగా ఇబ్బందులు పడుతున్నారు. 


ఈ పరిస్థితిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా స్పందించారు. అమెరికాలో ద్రవ్యోల్బణం ఆమోదయోగ్యం కాని స్థాయిలో ఉందని చెప్పారు. ఇన్నాళ్లుగా ప్రభుత్వం చేపడుతున్న చర్యల ప్రభావాన్ని అవి ప్రతిఫలించట్లేదని వ్యాఖ్యానించారు. ‘‘గత  ముప్ఫై రోజుల్లో పెట్రోల్ ధరలు 40 సెంట్ల మేర తగ్గాయి. అలాగే.. గోధుమలు, ఇతర నిత్యావసరాల ధరలు కూడా తగ్గాయి. కానీ వీటి ప్రభావం ప్రభుత్వ గణాంకాల్లో కనిపించలేదు.’’ అని వ్యాఖ్యానించారు. 

Updated Date - 2022-07-14T03:30:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising