ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

H1-B Visa: 2023 ఏడాదికి సంబంధించి అమెరికా కీలక ప్రకటన!

ABN, First Publish Date - 2022-08-25T00:39:42+05:30

H1-Bవీసాల విషయంలో అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(USCIS) కీలక ప్రకటన చేసింది. అమెరికా కాంగ్రెస్ చెప్పినట్లుగా 2023 సంవత్సరానికిగానూ 65వేల వీసాలు జారీ చేయడానికి అవసరమైన అప్లికేషన్లు(H-1B visa Applicatio

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: H1-Bవీసాల విషయంలో అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(USCIS) కీలక ప్రకటన చేసింది. అమెరికా కాంగ్రెస్ చెప్పినట్లుగా 2023 సంవత్సరానికిగానూ 65వేల వీసాలు జారీ చేయడానికి అవసరమైన అప్లికేషన్లు(H-1B visa Applications) వచ్చాయని మంగళవారం ప్రకటనలో పేర్కొంది. ‘యూఎస్ కాంగ్రెస్ సూచించినట్టుగా 65వేల హెచ్1బీ వీసాలు జారీ చేయడానికి సరిపడా అప్లికేషన్లు అందాయి. వీటితోపాటు.. 2023ఆర్థిక సంవత్సరానికి యూఎస్ అడ్వాన్స్‌డ్ డిగ్రీ ఎగ్జెమ్షన్ కింద జారీ చేసే 20వేల H1-B వీసాల కోసం తగినన్ని దరఖాస్తులు వచ్చాయి’ వెల్లడించింది. అంతేకాకుండా వీసాల కోసం అప్లై చేసుకున్న వారికి ఇప్పటికే నోటిఫికేషన్లు కూడా పంపినట్టు చెప్పింది. 



ఇదిలా ఉంటే.. H1-B వీసాలకు ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.   ప్రత్యేక నైపుణ్యాలు, వృత్తి నిపుణులు అమెరికాలో పనిచేసేందుకు గానూ యూఎస్ ప్రభుత్వం ప్రతి ఏడాది పరిమిత సంఖ్యలో హెచ్‌-1బీ వీసాను జారీ చేస్తుంది. ఇందుకోసం ప్రతిఏటా కొత్తగా దాదాపు 65వేల వీసాలతోపాటు అమెరికాలో మాస్టర్స్‌ డిగ్రీ కోసం మరో 20వేల వీసాలను కేటాయిస్తుందన్న విషయం తెలిసిందే. ఇందులో అత్యధిక వీసాలు భారత్(Indians), చైనా(Chinese) పౌరులకే దక్కుతాయి. 


Updated Date - 2022-08-25T00:39:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising